AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Bharat Yatra: మాతా వైష్ణవి టెంపుల్, హరిద్వార్, ఢిల్లీ సహా ప్రముఖ ప్రాంతాల పర్యటన రైల్వే ప్రత్యేక ప్యాకేజీతో రైలు..

Uttar Bharat Yatra: భారత దేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీతో రైల్వే శాఖ ముందుకు వచ్చింది. ఉత్తర భారత దేశంలోని ప్రముఖ పర్యాటక...

Uttar Bharat Yatra: మాతా వైష్ణవి టెంపుల్, హరిద్వార్, ఢిల్లీ సహా ప్రముఖ  ప్రాంతాల పర్యటన రైల్వే ప్రత్యేక ప్యాకేజీతో రైలు..
North India Tour
Surya Kala
|

Updated on: Jun 19, 2021 | 12:59 PM

Share

Uttar Bharat Yatra: భారత దేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీతో రైల్వే శాఖ ముందుకు వచ్చింది. ఉత్తర భారత దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలుపుకుని అన్ని సదుపాయాలను కల్పిస్తూ తక్కువ ధరకే టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే టూరిస్టు శాఖ. అత్యున్నత సరసమైన ఢిల్లీ నుంచి వైష్ణో దేవి ఆలయం సందర్శనం కోసం ప్యాకేజీని ఐఆర్‌సిటిసి విడుదల చేసింది. ఈ ప్రయాణాలు 11 పగలు, 10 రాత్రులు ఉంటుంది. ఈ ప్రయాణం కోసం మరిన్ని వివరాలను IRCTC యొక్క అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ను సందర్శించాల్సి ఉంది. అంతేకాదు టికెట్స్ ను టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు మరియు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

ఈ ఉత్తర భర దేశ తీర్థయాత్రలో ఆగ్రా , మధుర, వైష్ణో దేవి , అమృత్ సర్ , హరిద్వార్ , ఢిల్లీ సందర్శన ప్రదేశాలు. తెలుగు రాష్ట్రాల్లో బోర్డింగ్ పాయింట్లు: రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, పెద్దాపల్లి, కాజిపేట, రామగుండం మరియు నాగ్ పూర్ లు.

టూర్ ప్యాకేజీ వివరాలు 27.08.2021న రేణిగుంట నుంచి 00:05 గం. లకు ఈ వైష్ణవి దేవీ యాత్ర ప్రారంభం కానుంది. ఈ టూర్ ప్యాకేజీ కోసం రైల్వే కంపార్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తి రూ రూ .10,400 లు చెల్లించాల్సి ఉండగా..అందనపు ప్రయోజనాల కోసం సింగిల్ ఫ్యాకేజీ కి రూ. 17,330 ధర చెల్లించాల్సి ఉంది. అయితే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఛార్జీలు లేవని రైల్వే శాఖ మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

Also Read: యోగాసనాలవలన ఆరోగ్యప్రయోజనాలను వివరిస్తూ వీడియో షేర్ చేసిన మాధురీ దీక్షిత్