Alex Harvill: వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం.. ప్రమాదవశాత్తు మోటోక్రాస్ రేసర్ దుర్మరణం..

Motorbike Rider Alex Harvill: ప్రపంచ రికార్డు కోసం కొంతమంది కఠిన ప్రయత్నాలు చేస్తుంటారు. వారి లక్ష్యాన్ని సాధించడం కోసం అనుక్షణం తపన పడుతుంటారు. ఈ ప్రయత్నంలో

Alex Harvill: వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం.. ప్రమాదవశాత్తు మోటోక్రాస్ రేసర్ దుర్మరణం..
Alex Harvill
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 19, 2021 | 9:42 AM

Motorbike Rider Alex Harvill: ప్రపంచ రికార్డు కోసం కొంతమంది కఠిన ప్రయత్నాలు చేస్తుంటారు. వారి లక్ష్యాన్ని సాధించడం కోసం అనుక్షణం తపన పడుతుంటారు. ఈ ప్రయత్నంలో ప్రాణాలను సైతం పణంగా పెడతారు. గ‌తంలో త‌న పేరుపై ఉన్న రికార్డ్‌లను చెరిపేసి.. మరో రికార్డును క్రియేట్ చేయాల‌నుకున్న 28 ఏళ్ల బైక్ జంపర్.. అమెరికా డేర్ డెవిల్.. అలెక్స్ హార్విల్ క‌న్నుమూశాడు. మోటార్ సైకిల్ జంప్ కోసం అలెక్స్ హార్విల్ గురువారం ఉదయం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై చనిపోయినట్లు వాషింగ్టన్ అధికారులు తెలిపారు.

అలెక్స్ హార్విల్ 2013లోనే 297 అడుగ‌ల దూరం బైక్ జంప్ చేసి ప్ర‌పంచ రికార్డ్‌ను నెలకొల్పాడు. అయితే.. 2008లో రాబి మాడిస‌న్ పేరిట నమోదైన 351 అడుగుల ప్ర‌పంచ రికార్డును బ్రేక్ చేసేందుకు అలెక్స్ ప్ర‌య‌త్నించాడు. కానీ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తూ.. ప్రాక్టిస్ చేస్తున్న సంద‌ర్భంలో ప్ర‌మాద‌వ‌శాత్తు అలెక్స్ మ‌ర‌ణించాడు. అలెక్స్ మోటార్ సైకిల్ దిగాల్సిన చోటు కంటే కాస్త ముందే లాండ్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హార్విల్ హాండిల్ బార్ మీద నుంచి ఎగిరిడి దుర్మరణం చెందాడు.

Motorbike Rider Alex Harvill

Motorbike Rider Alex Harvill

హార్విల్ అనతి కాలంలోనే ఒక ప్రొఫెషనల్ మోటోక్రాస్ రేసర్‌గా పేరు సంపాదించుకున్నాడు. అతిని పేరున ఇప్పటికే రెండు మోటార్ సైకిల్ జంప్ రికార్డులు ఉన్నాయి.

Also Read:

World Records Match : వన్డే మ్యాచ్‌లో 867 పరుగులు..! 42 బంతుల్లో 192 పరుగులు.. 2 ప్రపంచ రికార్డులు నమోదు

Viral News: ఆ మామిడి పండ్లకు నలుగురు సిబ్బంది, ఆరు కుక్కలు సెక్యూరిటీ.! ఎందుకో తెలుసా.?