AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: రష్యా, ఉక్రెయిన్​ యుద్ధంలో విజేతలు ఉండరు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని.. అందరూ నష్టపోతారని భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ మాత్రం శాంతి పక్షానే నిలుస్తోందని ప్రధాని మోదీ మరోసారి తేల్చి చెప్పారు.

PM Modi: రష్యా, ఉక్రెయిన్​ యుద్ధంలో విజేతలు ఉండరు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
Prime Minister Narendra Mod
Sanjay Kasula
|

Updated on: May 02, 2022 | 10:55 PM

Share

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని.. అందరూ నష్టపోతారని భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ మాత్రం శాంతి పక్షానే నిలుస్తోందని ప్రధాని మోదీ మరోసారి తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని.. ఆహార ధాన్యాలు, ఎరువుల కొరత కారణంగా ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు ప్రధాని మోడీ. దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై అధికంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై దాడి చేయడం ద్వారా రష్యా ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను రష్యా ఉల్లంఘించిందని జర్మనీ ఛాన్సలర్​ స్కోల్జ్ అభిప్రయాపడ్డారు. జర్మనీలో జరిగే జీ-7 సదస్సుకు ప్రధాని మోదీని కూడా ఆహ్వానించామన్నారు.

మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ.. రాజధాని బెర్లిన్​లో ఆ దేశ ఛాన్సలర్​ ఒలాఫ్​ స్కోల్జ్​తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వాణిజ్యానికి ప్రోత్సాహకాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరి మధ్య చర్చలు జరగాయి. 6వ ఇండియా- జర్మనీ గవర్నమెంటల్​ కన్సల్టేషన్స్​ (IGS)లో ఒలాఫ్​ స్కోల్జ్​తో కలిసి పాల్గొన్నారు మోడీ. ప్రధానితో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు.

2021 డిసెంబర్‌లో ఛాన్సలర్ స్కోల్జ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీతో భేటీ కావడం ఇదే మొదటిసారి. మా వ్యూహాత్మక భాగస్వామితో ఉన్నత స్థాయి సమావేశం తర్వాత సంబంధాలు మరింత పెరుగుతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ప్రధాని అయిన తర్వాత మోదీ జర్మనీలో పర్యటించడం ఇది ఐదోసారి. అంతకుముందు ఏప్రిల్ 2018, జులై 2017, మే 2017, ఏప్రిల్ 2015లో జర్మనీని సందర్శించారు.

ఇవి కూడా చదవండి: KA Paul: జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి.. సిరిసిల్ల వెళ్తుండగా అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు..

Imran Khan: సౌదీలో పాక్ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు.. ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం..