AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు క్యాన్సర్.. యుద్ధం మధ్యలోనే సెలవుపై..

ఓ వైపు యుద్ధం జరుగుతుండగానే పుతిన్ సెలవుపై వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకునేందుకు ఈ సెలవు తీసుకున్నారు. పుతిన్ లేని పక్షంలో..

Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు క్యాన్సర్.. యుద్ధం మధ్యలోనే సెలవుపై..
Putin
Sanjay Kasula
|

Updated on: May 02, 2022 | 7:37 PM

Share

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం(Russia Ukraine War) రెండు నెలలు దాటింది. అమెరికాతో సహా అన్ని దేశాలు రష్యాను వివిధ మార్గాల్లో ముట్టడించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) మాత్రం తన పట్టుదలపై గట్టిగానే ఉన్నారు. కాల్పుల విరమణను ఆపలేదు. ఓ వైపు యుద్ధం జరుగుతుండగానే పుతిన్ సెలవుపై వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకునేందుకు ఈ సెలవు తీసుకున్నారు. పుతిన్ లేని పక్షంలో రష్యాకు నాయకత్వం వహించేది ఎవరనే దానిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయా మీడియా నివేదికల ప్రకారం, పుతిన్ తన గైర్హాజరీలో రష్యా ఆదేశాన్ని రష్యా భద్రతా మండలి చీఫ్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ FSB మాజీ చీఫ్ నికోలాయ్ పెట్రుషెవ్‌కు అప్పగించవచ్చని తెలుస్తోంది. అతను పుతిన్‌కు దగ్గరగా ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరు. ఈ సమయంలో ఉక్రెయిన్ యుద్ధం ఆదేశం కూడా పెట్రుషెవ్ చేతిలో ఉంటుంది.

మే 9 తర్వాత ఆపరేషన్..

పుతిన్ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని రష్యా టెలిగ్రామ్ ఛానెల్ వెల్లడించింది. 18 నెలల క్రితం పుతిన్‌కు కడుపులో క్యాన్సర్‌, పార్కిన్‌సన్స్‌ వ్యాధి ఉన్నట్లు పేర్కొంది. అప్పుడు వైద్యులు శస్త్రచికిత్స చేయమని కోరగా.. వారు దానిని వాయిదా వేశారు. ఇప్పుడు అతను అధ్యక్షుడిగా మే 9న విక్టరీ డే పరేడ్‌కు హాజరైన తర్వాత ఈ ఆపరేషన్‌ను చేయించుకేనే అకాశం ఉంది.

నికోలాయ్ పెట్రుషెవ్ ప్రొఫైల్ ఇది

పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా నికోలాయ్ పెట్రుషెవ్ పేరుంది. రష్యాకు వ్యతిరేకంగా జరిగే కుట్రలు పన్నుతున్న ఉక్రెయిన్ నియో-నాజీలతో నిండి ఉందని పుతిన్‌ను ఒప్పించిన వ్యక్తి ఇతనే. ఇది జరిగిన తర్వాతే పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టాడు.

ఇవి కూడా చదవండి: KA Paul: జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి.. సిరిసిల్ల వెళ్తుండగా అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు..

Imran Khan: సౌదీలో పాక్ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు.. ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం..