Imran Khan: సౌదీలో పాక్ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు.. ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధం..
సౌదీ అరేబియాలోని(Dubai) పవిత్ర మస్జిద్-ఎ-నవాబీలో(Masjid-i-Nabwi) ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు(PM Shehbaz Sharif ) వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉలిక్కిపడ్డారు. ఇమ్రాన్‌తో పాటు అతని...
సౌదీ అరేబియాలోని(Dubai) పవిత్ర మస్జిద్-ఎ-నవాబీలో(Masjid-i-Nabwi) ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు(PM Shehbaz Sharif ) వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉలిక్కిపడ్డారు. ఇమ్రాన్‌తో పాటు అతని ఐదుగురు సహచరులపై ఫైసలాబాద్‌లో కేసు నమోదైంది. మదీనా వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజకీయ నినాదాలు చేయడం క్షమించరాని నేరమని పాకిస్తాన్ హోంమంత్రి రాణా సనావుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్.. అతని సహచరులను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. సౌదీ అరేబియా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాలు మరింత పెరిగాయి. ఇమ్రాన్‌ఖాన్‌ను త్వరలో అరెస్ట్ చేస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. విదేశీ నిధుల దుర్వినియోగంతో పాటు ఆయనపై పలు అవినీతి కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఇమ్రాన్‌ఖాన్ ఈ కేసుల్లో జైలు పాలు కావడం ఖాయమని పాక్ ప్రభుత్వం చెబుతోంది. దొంగ దొంగ అని సంబోధిస్తూ షాబాజ్ షరీఫ్‌ను అవమానించినందుకు ఇమ్రాన్‌తో పాటు ఆయన మద్దతుదారులపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో కూడా ఇమ్రాన్‌ను అరెస్ట్ చేస్తామని పాక్ ప్రభుత్వం చెబుతోంది.
ఇమ్రాన్‌తో పాటు ఫవాద్ చౌదరి, షాబాజ్ గిల్, ఖాసీం సూరి, షహబ్జాదా జహంగీర్ ఖాన్, అనిల్ ముసరత్, షేక్ రషీద్‌లపై కేసు నమోదైంది . మదీనాలో నినాదాలు చేసిన షేక్ రషీద్ షఫీక్ సౌదీ అరేబియా నుంచి ఇస్లామాబాద్‌కు తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇమ్రాన్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన షేక్ రషీద్ మేనల్లుడు షఫీద్. పవిత్ర పుణ్యక్షేత్రం వద్ద నినాదాలు చేశారని, తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఈ అభియోగాలు రుజువైతే 5 నుంచి 8 ఏళ్ల జైలు శిక్ష.. భారీ జరిమానా విధించవచ్చు.
సౌదీ అరేబియా చాలా కఠినం మరోవైపు, మదీనాలో నినాదాలు చేసిన ఇమ్రాన్ మద్దతుదారులపై సౌదీ అరేబియా కఠినమైన వైఖరిని అవలంభిస్తోంది. ఇలాంటి ఘటనల్లో 158 మందిని అరెస్టు చేశారు. వారు 3 సంవత్సరాల శిక్షతో పాటు సౌదీ కరెన్సీ రియాల్‌లో జరిమానా కూడా చెల్లించాల్సించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ,లండన్ నుంచి మదీనాకు చేరుకున్న వారి గురించి సౌదీ అరేబియా ప్రభుత్వం పాకిస్తాన్ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం నుంచి సమాచారం కోరింది. మంగళవారం మదీనాలో షాబాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా దొంగ, దొంగ అంటూ నినాదాలు చేశారు. సౌదీ కోరిన సమాచారాన్ని తాము ఇవ్వబోతున్నామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి: Rahul Gandhi: ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి లేదు.. తేల్చి చెప్పిన ఉస్మానియా వర్శిటీ రిజిస్ట్రార్
Health Tips: ఆ సమస్యలకు చెరుకు రసం దివ్య ఔషధం.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..