AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: ఓయూలో రాహుల్‌ పర్యటనకు అనుమతి లేదు.. తేల్చి చెప్పిన ఉస్మానియా వర్శిటీ రిజిస్ట్రార్

ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఓయూ రణరంగంగా మారింది.

Rahul Gandhi: ఓయూలో రాహుల్‌ పర్యటనకు అనుమతి లేదు.. తేల్చి చెప్పిన ఉస్మానియా వర్శిటీ  రిజిస్ట్రార్
Rahul
Sanjay Kasula
|

Updated on: May 02, 2022 | 4:06 PM

Share

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం మరింత ముదురుతోంది. పాలక మండలి రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. Ou లో అధికారుల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది . ఇతర సంఘాల నుంచి కూడా అనుమతి ఇవ్వకూడదని అభ్యంతరాలు వచ్చాయని.. లా అండ్ ఆర్డర్ పరిగణలోకి తీసుకుని అనుమతి ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు వర్శిటీ ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య పప్పుల లక్ష్మీనారాయణ. ఈ వివరాలను పర్మిషన్ కోరిన మానవతా రాయ్‌కి లేఖ రూపంలో అందించారు. అయితే తాజాగా.. ఉస్మానియా వర్సిటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. విద్యార్థుల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. రాహుల్ గాంధీ ఓయు పర్యటనకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజ్ వద్దకు చేరుకున్నారు నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ దయాకర్, విద్యార్థి నేతలు లోకేష్ యాదవ్,బైరు నాగరాజు.

అయితే వారిని అరెస్టు చేసి ఓయూ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. అరెస్ట్‌లను విద్యార్థి సంఘాల నాయకులు తప్పుబట్టారు. రాహుల్‌ తెలంగాణ టూర్‌ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఓయూలో సభకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌ నిరసనల బాట పట్టింది. నిన్న ఆందోళనకు దిగిన NSUI కార్యకర్తల అరెస్టును నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఎన్‌ఎస్‌యూఐ పిలుపు ఇచ్చింది. ఇవాళ ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి. రాహుల్‌ను కలిసేందుకు విద్యార్తులకు అనుమతి ఇవ్వాలని VCని కోరనున్నారు.

మరోవైపు కాసేపట్లో చంచల్‌గూడ జైల్లో కాంగ్రెస్‌ కార్యకర్తల పరామర్శకు వెళ్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నిన్న ఉస్మానియా ఘర్షణ నేపథ్యంలో బల్మూరి వెంకట్ సహా 18 మంది కార్యకర్తలను చంచల్‌గూడ జైలుకు తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. జైలుకు వెళ్లి పరామర్శించనున్నారు జగ్గారెడ్డి.

రాజకీయాలకు అతీతంగా రాహుల్‌ ఓయూకి వస్తారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్‌ ఓయూ వీసీని కలిసి అనుమతి కోరినా.. రాజకీయ సభలకు అనుమతి లేదంటూ తిరస్కరించడంతో కాంగ్రెస్‌ అనుబంధ విభాగాలు ఆందోళనకు దిగాయి.

తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి: Health Tips: ఆ సమస్యలకు చెరుకు రసం దివ్య ఔషధం.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..

Excise Scam: వీకెండ్ పార్టీ లకు దొంగ పర్మిషన్లు.. బయటపడిన ఆబ్కారీ ఇంటిదొంగల నయా స్కామ్..