Telangana News: చిన్నారి చనిపోయిందని అంత్యక్రియలు చేయబోయారు. చివరి నిమిషంలో ఊహించని పరిణామం

Telangana News: ప్రాణం పోయిన తరువాత వ్యక్తులు బతికిన ఘటనలు మనం వార్తల్లో చూశాం. కొన్ని సార్లు ఏకంగా శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు చేసేటప్పుడు లేచి కూర్చున్న వార్తలూ విన్నాం. కానీ..

Telangana News: చిన్నారి చనిపోయిందని అంత్యక్రియలు చేయబోయారు. చివరి నిమిషంలో ఊహించని పరిణామం
Baby
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 02, 2022 | 1:59 PM

Telangana News: ప్రాణం పోయిన తరువాత వ్యక్తులు బతికిన ఘటనలు మనం వార్తల్లో చూశాం. కొన్ని సార్లు ఏకంగా శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు చేసేటప్పుడు లేచి కూర్చున్న వార్తలూ విన్నాం. కానీ తెలంగాణలో ఓ చిన్నారి విషయంలోనూ అచ్చం ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. దీనిని చూసినవారంతా ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అనారోగ్యంతో ఉన్న శిశువు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పటంతో సదరు కుటుంబ సభ్యులు పాపను ఇంటికి తీసుకెళ్లిపోయారు. తరువాత ఖననం చేసేందుకు తీసుకెళ్లగా.. సీన్ రివర్స్ అయింది. ఇంతకీ అక్కడ ఏమి జరిగిందంటే..

అమ్మా నేను బలికే ఉన్నా అంటూ..

జగిత్యాలకు(Jagtial News) చెందిన వాసాల వేణుమాధవ్‌ దంపతులకు ఇటీవల ఆడబిడ్డ పుట్టింది. అనారోగ్యానికి గురికావటంతో తల్లిదండ్రులు కరీంనగర్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. శిశువు చనిపోయిందని సదరు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆ పసికందు చనిపోయిందని అందరూ భావించారు. బరువెక్కిన హృదయంతో పాప కుటుంబసభ్యలు శిశువును శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఖననం చేసే సమయంలో శిశువు కదలటంతో అప్రమత్తమైన వారు.. హుటాహుటిన జగిత్యాల పట్టణంలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ప్రారంభించిన వైద్యులు పాప ప్రాణాలు కాపాడారు. ఈ ఆశ్చర్యకర ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలను సేకరించిన శిశుసంక్షేమశాఖ అధికారులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి..

LIC-IPO: ఈరోజు తెరుచుకున్న యాంకర్ ఐపీవో.. అసలు యాంకర్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు తెలుసుకోండి!

CIA CTO: అమెరికా గూఢచార సంస్థలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి.. చరిత్రలో తొలిసారిగా..