Telugu News Telangana Telangana politics Union minister Kishan reddy hits back TS minister KTR over power crisis criticism
TRS vs BJP: తగ్గేదే లే.. ముదురుతున్న మాటల యుద్ధం.. కేటీఆర్, కిషన్ రెడ్డిల మధ్య ట్వీట్ వార్..
Minister KTR vs Kishan Reddy: టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పరస్పర విమర్శ, ప్రతి విమర్శలతో ట్వీట్ వార్‌కు దిగారు తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Telangana Minister KTR vs Union Minister Kishan Reddy
Minister KTR vs Kishan Reddy: టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పరస్పర విమర్శ, ప్రతి విమర్శలతో ట్వీట్ వార్‌కు దిగారు తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో అన్ని సమస్యలకు ప్రధాని నరేంద్ర మోడీకి విజన్ లేకపోవడమే కారణమంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దేశంలో బొగ్గు కొరత కారణంగా నెలకొన్న విద్యుత్ సమస్యపై ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత.. అన్ని సమస్యలకు మూలం పీఎం మోడీకి విజన్ కొరత’ అంటూ ఎద్దేవా చేశారు. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సమస్య ఏర్పడినట్లు పత్రికలో వచ్చిన కథనాన్ని జతచేర్చూతూ కేటీఆర్ కేంద్రంపై విరుచుకపడ్డారు.
మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్ పాలనలో ఇంటికో ఉద్యోగం లేదు.. నిరోద్యోగ భృతి లేదు.. ఉచిత ఎరువులు లేదు.. రుణమాఫీ లేదు.. దళిత ముఖ్యమంత్రి లేదు.. దళితులకు మూడెకరాల భూమి లేదు.. పంటనష్ట పరిహారం లేదు.. దళితబందు లేదు.. బీసీ బందు అసలే లేదు.. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు.. డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు అంటూ ట్వీట్ చేశారు. అప్పులకు కొదవ లేదు.. కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు.. కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు. సామాజిక న్యాయం లేదు.. సచివాలయం లేదు. సీఎం ప్రజలను కలిసేది లేదు.. ఉద్యమకారులకు గౌరవం లేదు.. విమోచన దినోత్సవం జరిపేది లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదంటూ మరో ట్వీట్‌లో కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.