Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel-Hamas: ఇజ్రాయెల్‌లోని భారతీయ విద్యార్థులను తీసుకొస్తాం: కేంద్రమంత్రి మీనాక్షి లేఖి

ఇజ్రాయెల్‌ పాలస్తీనాల మధ్య భీకర పోరు జరుగుతోంది. అయితే ఈ యుద్ధ పరిణామాలను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా గమనిస్తోందని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పేర్కొన్నారు. అయితే ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Israel-Hamas: ఇజ్రాయెల్‌లోని భారతీయ విద్యార్థులను తీసుకొస్తాం: కేంద్రమంత్రి మీనాక్షి లేఖి
Union Minister Meenakshi
Aravind B
|

Updated on: Oct 08, 2023 | 10:18 PM

Share

ఇజ్రాయెల్‌ పాలస్తీనాల మధ్య భీకర పోరు జరుగుతోంది. అయితే ఈ యుద్ధ పరిణామాలను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా గమనిస్తోందని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పేర్కొన్నారు. అయితే ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన మంత్రి, ఆయన కార్యాలయ సిబ్బంది అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిణ చేస్తున్నారు. అయితే అక్కడ చిక్కుకుపోయిన మన విద్యార్థులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమె పేర్కొన్నారు.

అలాగే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో చిక్కుకుపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. అయితే ఆ సమయంలో ఆపరేషన్‌ గంగ, వందేభారత్‌ తదితర ఆపరేషన్లు చేపట్టామని.. వీటి ద్వారా ప్రతి ఒక్కరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చామని తెలిపారు. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం, ప్రధాన మంత్రి కార్యాలయం ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నటువంటి విద్యార్థులతో నేరుగా టచ్‌లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని కచ్చితంగా తెలుసుకుంటోందని చెప్పారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ఇదివరకే అడ్వైజరీని జారీ చేసింది. అలాగే భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..