Jakarta: జకర్తాలో ఘోర అగ్ని ప్రమాదం.. 17 మందికి పైగా మృతి.. మంటలార్పుతున్న 37 ఫైరింజన్లు..

ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. నిన్న రాత్రి జరిగింది ఈ ఘటన

Jakarta: జకర్తాలో ఘోర అగ్ని ప్రమాదం.. 17 మందికి పైగా మృతి.. మంటలార్పుతున్న 37 ఫైరింజన్లు..
Fire Accident
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 04, 2023 | 7:51 AM

ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. నిన్న రాత్రి జరిగింది ఈ ఘటన, 180 మంది అగ్నిమాపక సిబ్బంది, 37 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకన్ని మంటలను అదుపులోకి తెచ్చేందుకు పయత్నిస్తున్నారు.

ఉత్తర జకార్తాలోని తనహ్​ మేరా పరిసర ప్రాంతంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆయిల్​ డిపోలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇండోనేసియా ఇంధన అవసరాల్లో 25 శాతం మేర ఈ డిపో నుంచి సరఫరా చేస్తుంది. భారీ వర్షంతో పాటుగా పిడుగుల కారణంగా ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడం వల్ల అగ్నిమాపక అధికారులు నివాస ప్రాంతాల్లో ఉండే వేలాది మంది ప్రజలను హుటాహుటిన ఖాళీ చేయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..