AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

France Protest: ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న హింస.. 200 మంది పోలీసులకు గాయాలు, 1300 మందికి పైగా అరెస్టు

నహెల్ మరణించి ఐదు రోజులైనా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో సహా అనేక భారీ నగరాల్లో కాల్పులు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రోడ్డుపైకి వచ్చిన ఆందోళనకారులు పదుల సంఖ్యలో వాహనాలకు నిప్పు పెట్టారు. రాజధాని ప్యారిస్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆందోళన కారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ హింసాకాండలో కనీసం 200 మంది పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం.

France Protest: ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న హింస.. 200 మంది పోలీసులకు గాయాలు, 1300 మందికి పైగా అరెస్టు
France Protest
Surya Kala
|

Updated on: Jul 02, 2023 | 12:43 PM

Share

ఫ్రాన్స్‌ దేశం ఆందోళలనతో అట్టుడుకుతోంది. ట్రాఫిక్ తనిఖీల్లో పోలీసుల బుల్లెట్‌ తగిలి  17 ఏళ్ల నహెల్ ఎం. నహెల్ ప్రాణాలు కోల్పోయాడు. నహేల్ అంత్యక్రియల తర్వాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు కలగలేదు. అంతేకాదు మళ్ళీ అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు  రాజధాని పారిస్ సహా దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు, భద్రతా బలగాలు మోహరించారు.

నహెల్ మరణించి ఐదు రోజులైనా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో సహా అనేక భారీ నగరాల్లో కాల్పులు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రోడ్డుపైకి వచ్చిన ఆందోళనకారులు పదుల సంఖ్యలో వాహనాలకు నిప్పు పెట్టారు. రాజధాని ప్యారిస్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆందోళన కారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ హింసాకాండలో కనీసం 200 మంది పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా దాదాపు 1300 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు.

  1. మరోవైపు నహెల్‌ మృత దేహాన్ని పారిస్‌లోని నాంటెర్రేలో దహనం చేశారు. మోంట్ వలేరియన్ శ్మశానవాటికలో జరిగిన నాహెల్ అంత్యక్రియలకు తల్లి, అమ్మమ్మ సహా వందలాది మంది హాజరయ్యారు.
  2. నహెల్ అల్జీరియన్ మూలానికి చెందిన పౌరుడు. పారిస్‌లో నివసిస్తున్నాడు. మంగళవారం, పారిస్‌లోని నాంటెర్రేలో ట్రాఫిక్ తనిఖీలో ఒక పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటన మొత్తం సీసీటీవీలో కూడా రికార్డైంది.
  3. ఇవి కూడా చదవండి
  4. వీడియో వైరల్ కావడంతో ప్రజలు నహెల్ మరణాన్ని హత్యగా అభివర్ణించారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా హింసాత్మక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని నుంచి రాష్ట్రపతి వరకు విచారం వ్యక్తం చేశారు.
  5. ఫ్రాన్స్‌లో పరిస్థితి చాలా దారుణంగా మారింది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన జర్మనీ పర్యటనను వాయిదా వేశారు. వాస్తవానికి మాక్రాన్ ఆదివారం జర్మనీ వెళ్లాల్సి ఉంది. ఈ ఘటనపై రాష్ట్రపతితో మాక్రాన్ ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించారు.
  6. హింసాత్మక ప్రదర్శనలు ప్రారంభమైన తర్వాత ఆర్మీ వాహనాలు, హెలికాప్టర్‌లతో పాటు 45,000 మంది పోలీసులను పారిస్, లియోన్, మార్సెయిల్‌లో మోహరించారు. మార్సెయిల్‌లో ఆందోళన కారులపై పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. అక్కడ పరిస్థితి అత్యంత దయనీయ కరంగా మారింది.
  7. ఫ్రెంచ్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకారం శుక్రవారం రాత్రి నుండి 1311 మందిని అరెస్టు చేశారు. శనివారం  రాత్రి 875 మందిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం హింస తగ్గుముఖం పట్టింది. ఈ రోజు దేశవ్యాప్తంగా దాదాపు 200 మందిని అరెస్టు చేశారు.
  8. ఫ్రాన్స్‌లో హింసాత్మక ప్రదర్శనలు ప్రారంభమైనప్పటి నుండి.. ఆందోళనకారులు ఇప్పటివరకు 2000 వాహనాలకు పైగా నిప్పు పెట్టారు. శనివారం ఇంటీరియర్ మినిస్టర్ గెరాల్డ్ డెర్మానిన్ చేసిన ప్రదర్శన సమయంలో దాదాపు 200 మంది పోలీసులు గాయపడ్డారు.
  9. ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనలపై ప్రపంచంలోని అనేక దేశాలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ శీతాకాలంలో రగ్బీ ప్రపంచ కప్, 2024 వేసవిలో పారిస్ ఒలింపిక్ క్రీడలకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న నిరసన దీర్ఘకాలం కొనసాగితే, అప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  10. హింసాత్మక ప్రదర్శనల దృష్ట్యా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలు తమ పౌరులను, పర్యాటకులను హింస ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించాయి. మరి కొన్ని దేశాలు తమ పౌరులకు ఫ్రాన్స్‌కు ప్రయాణంలో మార్పులు చేసుకోవాలని సూచించాయి.
  11. మంత్రి గెరాల్డ్ డెర్మానిన్ అన్ని ప్రభుత్వ బస్సులు, ట్రామ్‌లను రాత్రిపూట ఆపాలని ఆదేశించారు. ఆందోళన కారులకు ఈ వాహనాలు లక్ష్యంగా మారాయని చెప్పారు. హింసను ప్రోత్సహించేందుకు ప్రయత్నించవద్దని సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను హెచ్చరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..