Joesthetics: 30 ఏళ్లకే మృతి చెందిన ప్రముఖ బాడీబిల్డర్‌.. అధిక స్టెరాయిడ్స్‌ వాడకంతో హఠన్మరణం

ప్రముఖ జర్మన్ బాడీబిల్డర్‌, ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ జో లిండ్నర్ అకా జోస్థెటిక్స్ (30) చిన్న వయసులోనే హఠన్మరణం చెందారు. నిముషాల వ్యవధిలోనే మృత్యుఒడిలోకి చేరుకున్నారు. లిండ్నర్‌ మరణం యావత్‌ బాడీబిల్డింగ్‌ ప్రపంచాన్ని షాక్‌కు..

Joesthetics: 30 ఏళ్లకే మృతి చెందిన ప్రముఖ బాడీబిల్డర్‌.. అధిక స్టెరాయిడ్స్‌ వాడకంతో హఠన్మరణం
Joesthetics
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 02, 2023 | 2:57 PM

జర్మనీ: ప్రముఖ జర్మన్ బాడీబిల్డర్‌, ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ జో లిండ్నర్ అకా జోస్థెటిక్స్ (30) చిన్న వయసులోనే హఠన్మరణం చెందారు. నిముషాల వ్యవధిలోనే మృత్యుఒడిలోకి చేరుకున్నారు. లిండ్నర్‌ మరణం యావత్‌ బాడీబిల్డింగ్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. జోస్థెటిక్స్‌కు మరణ వార్త వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మిలియన్ల అభిమానులు శోకసంద్రంలో మునిగారు. సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే అతనికి 85 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. తన ఫిట్‌నెస్‌ వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్‌లో పోస్టు చేస్తూ ఉంటారు. ఈ బాధాకర విషయాన్ని మరో జర్మన్ బాడీబిల్డర్ నోయెల్ డీజెల్ సోషల్‌ మీడియా వేదికగా ధృవీకరించారు. ఈ సందర్భంగా గతంలో లిండ్నర్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశాడు.

మూడు రోజుల క్రితం అరుదైన వ్యాధితో స్నేహితురాలు నీచాతో ఉండగా మృతి చెందాడు. ఆమెకు నెక్లెస్‌ బహుకరించినా కాసేపటికే అతను మృతి చెందినట్లు నీచా చెప్పుకొచ్చింది. 3 రోజుల క్రితం మెడ నొప్పిగా ఉందని తెలిపాడు. అయినా మేము దానిని గుర్తించడంలో ఆలస్యం చేశాం. కండరాల పెంపుదల కోసం కొన్ని వారాల క్రితం అధికంగా జిమ్‌లో శిక్షణ ఇచ్చారు. అధిక కసరత్తుల వల్ల గుండెపోటు వస్తుందని అప్పుడే భయపడ్డానని నిచా సోషల్‌ మీడియలో తెల్పింది. కాగా లిండ్నర్ ‘రిప్లింగ్ మజిల్‌ డిసీజ్‌’ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ బ్యాధి కారణంగా కండరాలు అతి సున్నితంగా మారి ఏమాత్రం కదలిక కనిపించినా తీవ్ర నొప్పి సంభవిస్తుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా బాడీబిల్డింగ్‌లో శరీర సౌష్ఠవం కోసం శిక్షకులు అవలంబించే కొన్ని రకాల పద్ధతులపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. కండరాల్లో నీటిని బయటికి పంపడానికి శిక్షకులు స్టెరాయిడ్స్‌ ఇస్తారు. దీని వల్ల ఎక్కువసార్లు మూత్రవిసర్జకు వెళ్లడం మూలంగా డీహైడ్రేషన్‌ సంభవిస్తుంది. లిండ్నర్‌కు వచ్చిన వ్యాధి కూడా డీహైడ్రేషన్‌ కారణంగానే వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 1992లో మహమ్మద్‌ బెనాజీజా అనే బాడీ బిల్డర్‌ కూడా విపరీతమైన డీహైడ్రేషన్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.