Viral Video: మొసలిని పెళ్లాడిన మేయర్.. నెట్టింట వైరలవుతోన్న వీడియో!
పెళ్లి జీవితంలో ఓ ముఖ్యమైన ఘటన. అందుకే జీవిత భాగస్వామిని ఏరికోరి ఎంచుకుంటుంటారు. ఐతే ఓ నగర మేయర్ మాత్రం మొసలిని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అసలింతకీ ఏం జరిగిందంటే..
మెక్సికో: పెళ్లి జీవితంలో ఓ ముఖ్యమైన ఘటన. అందుకే జీవిత భాగస్వామిని ఏరికోరి ఎంచుకుంటుంటారు. ఐతే ఓ నగర మేయర్ మాత్రం మొసలిని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అసలింతకీ ఏం జరిగిందంటే.. దక్షిణ మెక్సికోలోని శాన్ పెడ్రో హువామెలులా అనే చిన్న నగరానికి విక్టర్ హ్యూగో సోసా అనే వ్యక్తి మేయర్‌గా ఉన్నాడు. నగరంలోని ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో అలిసియా అడ్రియానా అనే మొసలిని సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు. నిజానికి మెక్సికో ప్రజలు ఎప్పటి నుంచో దీనిని సంప్రదాయంగా ఆచరిస్తున్నారు. సరీసృపాలను పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందనేది వారి నమ్మకం. రెండు స్వదేశీ సమూహాలు శాంతికి వచ్చిన రోజుకు చిహ్నంగా దాదాపు 230 ఏళ్లుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు అక్కడి ప్రజలు.
ఈ ఆచారంలో భాగంగా ఓ పురుషుడు ఓ ఆడ ముసలిని వివాహం చేసుకోవల్సి ఉంటుంది. అందుకే మేయర్ ఆడ మొసలిని వివాహం చేసుకున్నాడు. ఇలా వివాహం చేసుకోవడం వల్ల విస్తారంగా వర్షాలు పడతాయని, విత్తనాల అంకురోత్పత్తి, మనుషుల మధ్య శాంతి-సామరస్యం నెలకొంటాయని జైమ్ జరాటే అనే చరిత్రకారుడు తన రచనల్లో తెలిపాడు. అందుకే తాము ఇలా చేస్తుంటామని మేయర్ హ్యూగో సోసా తెలిపాడు. ఇక వివాహ వేడుకకు ముందు వరుడు మొసలిని తన ఇంటికి ఊరేగింపుగా తీసుకుని వెళ్తాడు. అందమైన దుస్తులతో మొసలిని ముస్తాబు చేసిన తర్వాత వరుడు తన చేతుల్లోకి తీసుకుని నాట్యం చేస్తాడు. వివాహతంతు పూర్తైన తర్వాత వరుడు మొసలి ముక్కుపై ముద్దు పెట్టుకుంటాడు కూడా. ఐతే మొసలి ఎవరిపై దాడి చేయకుండా ఉండేందుకు దాని నోరును కట్టి ఈ తంతుమొత్తం పూర్తి చేస్తామని మేయర్ అంటున్నాడు.
👰🐊 Como parte de una #tradición, el alcalde de San Pedro Huamelula, #Oaxaca, Víctor Hugo Sosa, se casó con un lagarto llamado princesa Alicia, esto para simbolizar la unión del hombre con lo divino. #México pic.twitter.com/Us8COaHYeL
— Luis Gabriel Velázquez (@soyluisgabriel1) July 2, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.