Snake – Lizard: బల్లిని చంపబోయిన పాముతో మరో బల్లి పోరాటం.. బల్లి స్నేహధర్మానికి నెటిజన్లు ఫిదా.
కష్టకాలంలో కూడా రక్షణ కవచంగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. ఏదైనా కష్టము వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని తరచుగా స్నేహితులు సినిమాల్లో చెప్పుకునే డైలాగ్.. అయితే ఈ మాటని మనుషులు ఎంత నిజం చేస్తారో తెలియదు కానీ.. ఒక మూగ జీవి మాత్రం నిజం చేసింది.
వైరల్ అవుతున్న వీడియోలో కొండమీద ఒక పాము బల్లి జాతికి చెందిన జెక్కోను పట్టుకుంది. జెక్కోను పూర్తిగా చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తోంది ఆ పాము. ఇంతలో మరో బల్లి రంగంలోకి దిగింది. తన ఫ్రెండ్ ను రక్షించడానికి పాముతో ప్రాణాలకు తెగించి హోరాహోరీ పోరాడింది. తానంటే భయపడకుండా పోరాడుతున్న బల్లిని కాటు వేయడానికి పాము శతవిధాలా ప్రయత్నించింది. తన తోటి ప్రాణిని కాపాడుకోఆడనికి తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడింది బల్లి. ఈ వీడియో ఓ యూజర్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు ఇదీ నిజమైన స్నేహధర్మం అంటున్నారు. ఈ వీడియో ఇప్పటికే లక్షలమంది వీక్షించగా 67 వేల మంది లైక్ చేశారు. తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

