AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imran Khan: పాక్‌ మాజీ ప్రధానికి ఊహించని షాక్‌.. ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ ఖాయం..!

మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) షాబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల సమావేశం కూడా అతని ఇంటి బయటే జరిగింది.

Imran Khan: పాక్‌ మాజీ ప్రధానికి ఊహించని షాక్‌.. ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ ఖాయం..!
Ex Pakistan Pm Imran Khan
Jyothi Gadda
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 22, 2022 | 1:12 PM

Share

Ex-Pakistan PM Imran Khan:పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ కావచ్చు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఇమ్రాన్‌ఖాన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. ఆగస్టు 20న ఇమ్రాన్‌ఖాన్‌ ఐజీని, జడ్జిని బెదిరించారని ఆ తర్వాత ఇమ్రాన్‌పై కేసు నమోదైంది.. అర్థరాత్రి ఇస్లామాబాద్‌ ఐజీ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసినట్లు సమాచారం. ఆగస్టు 20న ఇస్లామాబాద్‌లో షాబాజ్ గిల్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.. దానిని అన్ని టీవీ న్యూస్ ఛానెల్‌లు ప్రసారం చేశాయి.

ఆగస్టు 20న ఇస్లామాబాద్‌లో జరిగిన ర్యాలీలో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దేశ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. అంతే కాదు ఇస్లామాబాద్ ఐజీ సహా పలువురు పోలీసు అధికారులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అందిన నివేదికల ప్రకారం.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. లేదంటే గృహనిర్బంధంలోనైనా ఉంచవచ్చు. శనివారం ఇస్లామాబాద్‌లోని ఎఫ్‌-9 పార్క్‌లో ప్రసంగిస్తున్న సమయంలో పోలీసులు, న్యాయమూర్తులు, పాకిస్థాన్ ఎన్నికల సంఘం, రాజకీయ ప్రత్యర్థులను బెదిరించినందుకు కేసు నమోదైంది. ఇమ్రాన్ ప్రసంగం పోలీసులు, న్యాయమూర్తులు, దేశంలో భయం,అనిశ్చితిని సృష్టించిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇస్లామాబాద్ పోలీసు ఉన్నతాధికారులు, న్యాయమూర్తులను బెదిరించి దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) షాబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల సమావేశం కూడా అతని ఇంటి బయటే జరిగింది. పార్టీ ఇస్లామాబాద్‌కు మార్చ్‌ను ప్రకటించింది. పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇస్లామాబాద్ కు తరలివచ్చారు. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదని ప్రముఖ పీటీఐ నేత పర్వేజ్ ఖట్టక్ అన్నారు. కాగా, పోలీసుల చర్యను ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ సమర్థించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి