Viral Video: డాక్టర్‌ చెంప పగలగొట్టిన ముఖ్యమంత్రి కూతురు! క్షమాపణలు తెలిపిన తండ్రి..

రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె దురుసు ప్రవర్తన కారణంగా తండ్రీ కూతుళ్లు తీవ్ర విమర్శలపాలయ్యారు. వైద్యుడిపై కూతురు చేయిచేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. వివరాల్లోకెళ్తే..

Viral Video: డాక్టర్‌ చెంప పగలగొట్టిన ముఖ్యమంత్రి కూతురు! క్షమాపణలు తెలిపిన తండ్రి..
Cm's Daughter Hits Doctor
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 22, 2022 | 11:09 AM

Mizoram CM says sorry after daughter assaults doctor: రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె దురుసు ప్రవర్తన కారణంగా తండ్రీ కూతుళ్లు తీవ్ర విమర్శలపాలయ్యారు. వైద్యుడిపై కూతురు చేయిచేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. వివరాల్లోకెళ్తే..

మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె మిలారీ చాంగ్టే అపాయింట్‌మెంట్‌ లేకుండా గత బుధవారం (ఆగస్టు 17) ఐజ్వాల్‌లోని ఓ క్లినిక్‌లో డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించింది. ఐతే సదరు డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ లేనికారణంగా ఆమెను చూసేందుకు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన మిలారీ చాంగ్టే డాక్టర్‌పై దాడి చేసి ముఖంపై కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. డాక్టర్‌పై దాడి చేస్తున్న సమయంలో ఆమె చేతులను ఓ వ్యక్తి పట్టుకుని బయటకు బలవంతంగా తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూతురై ఉండి ఇలాగేనా ప్రవర్తించేది? అంటూ నెట్టింట విమర్శలు వెళ్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి

దీంతో డాక్టర్ పట్ల తన కుమార్తె ప్రవర్తనకు క్షమాపణలు తెలుపుతూ సీఎం జోరమ్‌తంగా శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. కుమార్తె ప్రవర్తనను సమర్థించడంలేదని, ఐజ్వాల్ డాక్టర్‌కు క్షమాపణలు తెల్పుతున్నాని పేర్కొంటూ సీఎం, సీఎం భార్య సంతకాలు పెట్టిన లెటర్‌ను ఇన్‌స్టా ఖాతా పోస్టులో తెలిపారు. ఈ ఘటనపై నిరసన తెలుపుతూ మిజోరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దిగారు