Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: పట్టుపురుగు చెట్టు పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహం సహా అనేక జ‌బ్బుల‌కు మల్బరీతో చెక్‌

జీర్ణవ్యవస్ధ మెరుగుపరిచేందుకు అద్భుతంగా పనిచేస్తాయి..మలబద్దకం, ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి వాటిని నివారిస్తాయి.. మల్బరీ పండ్లలో ఐరన్ సమృద్దిగా ఉండటం వల్ల ఎర్రరక్త కణాల పెరుగుదల,శరీర కణాలకు వేగంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది.

Health: పట్టుపురుగు చెట్టు పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహం సహా అనేక జ‌బ్బుల‌కు మల్బరీతో చెక్‌
Mulberry
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 22, 2022 | 10:53 AM

Mulberry For Health: పండ్లు అంటేనే ఆరోగ్య నిధిగా చెప్పొచ్చు. అలాంటి అనేక పోషక విలువలు కలిగిన పండ్లలో మల్బరీ పండ్లు కూడా ఒకటి..! ఈ పండ్లు చూడటానికి చిన్న సైజులో చిన్నగా ఉన్నా, ఇవి చేసే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మెండు. మల్బరీతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. మల్బరీ పండ్లలో విటమిన్ ఏ, బి, సి, డి ఉంటాయి.. వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, జింక్, ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ నేత్ర కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. వారంలో నాలుగు సార్లు ఈ పండును తీసుకుంటే కంటిచూపు పెరుగుతుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మధుమేహాన్ని తగ్గించడంలో ఈ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్ లను అడ్డుకుంటుంది. కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తుంది.

మల్బరీ కాయల్లో అనేక పోషకాలతోపాటు ఔషధగుణాలు ఉన్నాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. చర్మం మీద ముడతలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తికిని పెంపొందిస్తుంది.మల్బరీ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ హెపాటిక్ లిపోజెనిసిస్ ను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ స్ధాయిలను నిరోధించటంలో ఈ పండ్లు ఉపకరిస్తాయి.

మల్బరీని ఆహారంలో చేర్చుకోవటం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు తగ్గుతాయని చెబుతున్నారు. డయాబెటిస్ వల్ల వచ్చే బరువును నియంత్రించటంలో మల్బరీ ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్ధ మెరుగుపరిచేందుకు అద్భుతంగా పనిచేస్తాయి..మలబద్దకం, ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి వాటిని నివారిస్తాయి.. మల్బరీ పండ్లలో ఐరన్ సమృద్దిగా ఉండటం వల్ల ఎర్రరక్త కణాల పెరుగుదల,శరీర కణాలకు వేగంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి