Viral Video: అనవసరంగా గేదెతో పెట్టుకున్నాడు.. దెబ్బకు చెటెక్కిపడ్డాడు.. మూడు గంటలపాటు నరకమే..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలోని కొన్ని సెకన్లలో ఆ వ్యక్తి ఎలాగోలా తప్పించుకుని ఓ చెట్టుపైకెక్కి కూర్చున్నట్లు చూడవచ్చు. కానీ, ఆ మరుసటి సెకను ఏం జరిగిందో చూసి..ఆ వ్యక్తికి ఊపిరి ఆగిపోయినంత పనైంది.

Viral Video: అనవసరంగా గేదెతో పెట్టుకున్నాడు.. దెబ్బకు చెటెక్కిపడ్డాడు.. మూడు గంటలపాటు నరకమే..
Buffalo
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 22, 2022 | 8:32 AM

Viral Video: కొందరు వ్యక్తులు ఎటువంటి కారణం లేకుండా నోరులేని మూగజీవాలను వేధిస్తుంటారు..ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా చూసే ఉంటారు. కొందరతై క్రూరంగా వాటిని హింసిస్తుంటారు. చాలా సందర్భాల్లో అలాంటి జంతువులు.. భయపడి పారిపోతుంటాయి. కానీ, ఒక వ్యక్తి అకారణంగా గేదెను కర్రతో విచిక్షణా రహితంగా కొట్టడం మొదలుపెట్టాడు. అలాంటి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి కర్రతో గేదెను కొట్టిన వెంటనే దానికి సర్రున కోపం వచ్చింది..దాంతో అది అతని ప్రతీకారం తీర్చుకుంది. తనపై దాడి చేసిన వ్యక్తిని కుమ్మేసింది. దాంతో అతడు బతుకు జీవుడా అనుకుని..వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోతున్న ఆ వ్యక్తి వెంటే పడింది ఆ గేదె..అప్పుడు అతడు తప్పించుకునేందు కోసం పరుగెత్తడం తమాషాగా కనిపించింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలోని కొన్ని సెకన్లలో ఆ వ్యక్తి ఎలాగోలా తప్పించుకుని ఓ చెట్టుపైకెక్కి కూర్చున్నట్లు చూడవచ్చు. కానీ, ఆ మరుసటి సెకను ఏం జరిగిందో చూసి..ఆ వ్యక్తికి ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఆ గేదె కూడా అతడి వెంటే పరిగెత్తుకుంటూ వచ్చి అదే చెట్టుకింద నిల్చుంది.. అతడు ఎప్పుడు కిందకు వస్తాడా అని ఎదురు చూసింది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా సిర్సకలర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిదిగా తెలిసింది. ఇక ప్రాణ భయంతో చెట్టెక్కి కూర్చున్న ఆ వ్యక్తి సుమారు మూడు గంటల పాటు చెట్టుపై ఉండాల్సి వచ్చింది.. అయితే, ఆ తర్వాత గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఘటనా స్థలానికి చేరుకన్న పోలీసులు, స్థానికులు గేదెను తరిమికొట్టి ఆ వ్యక్తిని రక్షించారు. ఇక ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోకి నెటిజన్లు విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి