Andra Pradesh: వాహనాలను ఆపగానే తత్తరపాటుకు గురైన డ్రైవర్స్.. అనుమానంతో చెక్ చేయగా షాక్

అధికారుల కళ్లుగప్పి గుట్టుగా ఈ వాహనాల్లో తరలిస్తున్న బస్తాలను పరిశీలించగా అందులో కనిపించిన పదార్థాలు చూసి పోలీసులే కంగుతిన్నారు. వాహనాలను వెంటనే సీజ్ చేశారు.

Andra Pradesh: వాహనాలను ఆపగానే తత్తరపాటుకు గురైన డ్రైవర్స్.. అనుమానంతో చెక్ చేయగా షాక్
Ganja
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 21, 2022 | 2:32 PM

Ganja smuggling: ఏపీలో గంజాయి అక్రమ రవాణా యద్ధేచ్చగా సాగుతోంది.పోలీసులు,అధికారులు ఎన్ని కఠిన చర్యలు అమలుచేస్తు్న్నప్పటికీ అక్రమార్కుల చర్యలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా అల్లూరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.పాడేరు ఏజెన్సీ చింతపల్లి ప్రాంతంలోని అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ బొలేరో, మరో జీప్ ను పట్టుకున్నారు. అధికారుల కళ్లుగప్పి గుట్టుగా ఈ వాహనాల్లో తరలిస్తున్న బస్తాలను పరిశీలించగా అందులో గంజాయిని ఉన్నట్టు తేలింది. రెండు వాహనాల్లో కలిసి 56బస్తాల గంజాయి గంజాయిని గుర్తించారు.

పట్టుబడిన గంజాయి సుమారు 1700కిలోలుగా ఉంటుందని నిర్దారించిన పోలీసులు వెంటనే రెండు వాహనాలను సీజ్ చేసారు. ఈ గంజాయి విలువ 50లక్షల రూపాయల వరకు వుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలీసుల తనిఖీలను గుర్తించిన ఎనిమిదిమంది స్మగ్లర్లు పరారయ్యారు. ఈ గ్యాంగ్‌లో ఒక వ్యక్తిని మాత్రం పోలీసులు పట్టుకున్నాడు. ఈ గంజాయి స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి