Viral Video: వామ్మో..ఏం ధైర్యంరా బాబు..! 12 అడుగుల మొసలి నోట్లోంచి తప్పించుకున్నాడు.. పుర్రె ఎముకలు విరిగి మరీ..

వైరల్‌ అవుతున్న వీడియోలో..తాను, ఆ మొసలితో చేసిన ఫైటింగ్‌లో360 డిగ్రీలు తిరిగినట్లు డ్రోన్ వీడియో నీటిలో పోరాటాన్ని చూపిస్తుంది. అద్భుతంగా తప్పించుకున్న తర్వాత

Viral Video: వామ్మో..ఏం ధైర్యంరా బాబు..! 12 అడుగుల మొసలి నోట్లోంచి తప్పించుకున్నాడు.. పుర్రె ఎముకలు విరిగి మరీ..
Alligator Bites
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 21, 2022 | 1:21 PM

Viral Video: జువాన్ కార్లోస్ లా వెర్డే నదిలో ఈతకొడుతుండగా..ఓ భారీ మొసలి అతనిపై దాడి చేసింది. ఒక్కసారిగా అతనిపై పడ్డ మొసలి అతని తలను అమాంతంగా తన నోటితో పట్టేసింది. దాంతో అతడు..వెంటనే అప్రమత్తమయ్యాడు.. మరింత ధైర్యంగా మొసలితో పారాడి దాని దవడలను చీల్చుకుని తప్పించుకున్నట్టుగా చెప్పాడు. ఓ పక్క భయంకర మొసలి దాడితో తీవ్రంగా రక్తస్రావం అవుతున్నప్పటికీ మొసలితో పారాడనని చెప్పాడు. చివరకు మొసలిని ఓడించి ప్రాణాలతో తప్పించుకుని బయటపడ్డానని వివరించాడు.

వైరల్‌ అవుతున్న వీడియోలో..తాను, ఆ మొసలితో చేసిన ఫైటింగ్‌లో360 డిగ్రీలు తిరిగినట్లు డ్రోన్ వీడియో నీటిలో పోరాటాన్ని చూపిస్తుంది. అద్భుతంగా తప్పించుకున్న తర్వాత, అతను రేవుకు ఈదుకుంటూ వచ్చి బయటపడ్డాడు. అదృష్టవశాత్తూ..అతన్ని సమారిటన్ గమనించి హుటాహుటినా స్థానిక అంబులెన్స్‌కి కాల్ చేశాడు. వెంటనే టంపా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు..ఓ వైపు పుర్రె ఎముకలు విరిగినట్టుగా గుర్తించారు. అతని దవడలో కూడా అనేక ఎముకల పగుళ్లు గుర్తించారు. వైద్యులు అతనికి సర్జరీ చేశారు. ఆసుపత్రిలో ఒక వారం కోలుకున్న తర్వాత అతన్ని ఇంటికి వెళ్లమని సూచించారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి