AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Brahmani & Lokesh: పెళ్లి సమయంలో నారా లోకేశ్, బ్రహ్మణి ఎలా ఉన్నారో చూశారా ?.. నెట్టింట వీడియో వైరల్

వీరి వివాహం 2007 ఆగస్ట్ 26న జరిగింది. మరో నాలుగు రోజుల్లో వీరి వివాహం జరిగి 15 సంవత్సరాలు పూర్తికానుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరి నిశ్చితార్థం వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Nara Brahmani & Lokesh: పెళ్లి సమయంలో నారా లోకేశ్, బ్రహ్మణి ఎలా ఉన్నారో చూశారా ?.. నెట్టింట వీడియో వైరల్
Lokesh Brahmani
Follow us
Rajitha Chanti

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 25, 2022 | 5:05 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ పెద్ద కూతురు బ్రహ్మణి, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వివాహం ఇరువురి కుటుంబసభ్యుల మధ్య అంగరంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అంతేకాదు.. వీరు వరుసకు బావ మరదలు కూడా. బ్రహ్మణిని కొడలిగా చేసుకోవాలని ఎంతో ఆరాటపడి మరీ బాలయ్యను ఒప్పించి.. తన కోడలిగా చేసుకున్నారట చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. వీరిద్దరి వివాహానికి సినీ ప్రముఖులు.. రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరి వివాహం 2007 ఆగస్ట్ 26న జరిగింది. మరో నాలుగు రోజుల్లో వీరి వివాహం జరిగి 15 సంవత్సరాలు పూర్తికాగా.. 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీరి నిశ్చితార్థం వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందులో అలనాటి సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఎంతో సరదాగా కబుర్లు చెబుతూ కనిపించారు. అక్కినేని నాగార్జున, అమల, రాఘవేంద్రరావు, సురేష్ బాబు, వెంకటేష్ తదితరులు విచ్చేశారు. ప్రస్తుతం నారా బ్రహ్మణి హెరిటేజ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. నారా లోకేష్ రాజకీయాలలో కొనసాగుతున్నారు.

వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి