Oscar Award: ఆస్కార్ అవార్డ్ ప్రతిమ ఎందుకు నగ్నంగా ఉంటుందో తెలుసా.. వెరీ ఇంట్రెస్టింగ్ !

ఇంతకీ ఆస్కార్ అవార్డ్ అంటే ఏమిటీ ?.. దేనితో తయారు చేస్తారు ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఆస్కార్ గురించి అసలు విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా.

Oscar Award: ఆస్కార్ అవార్డ్ ప్రతిమ ఎందుకు నగ్నంగా ఉంటుందో తెలుసా.. వెరీ ఇంట్రెస్టింగ్ !
Oscar
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 21, 2022 | 9:30 AM

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ అస్కార్ (Oscar Award). చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు.. నటీనటులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ప్రధానం చేస్తుంటారు. కేవలం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీలలోని బెస్ట్ సెలబ్రెటీలను ఎంపిక చేసి ఈ అవార్డులను అందచేస్తారు. ఇక పరిశ్రమలో ప్రతి నటుడు.. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా ఈ ఆస్కార్ అవార్డ్ అందుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇప్పటివరకు హాలీవుడ్ నటీనటులు అనేకమంది ఈ అవార్డులను సొంతం చేసుకోగా.. భారతీయ చిత్రపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. అలాగే దక్షిణాది తమిళ్ స్టార్ హీరో సూర్య పలుమార్లు ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ చివరి నిమిషంలో చేజారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆస్కార్ రేసులో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి ఉన్నట్లుగా సమాచారం. దీంతో ఆస్కార్ అవార్డు పై తెలుగు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆస్కార్ అవార్డ్ అంటే ఏమిటీ ?.. దేనితో తయారు చేస్తారు ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఆస్కార్ గురించి అసలు విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా.

ఆస్కార్ ప్రతిమను కాంస్యంతో తయారు చేస్తారు. ఆ తర్వాత దానికి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు. ఈ ప్రతిమను పదమూడున్నర అంగుళాల ఎత్తు.. ఎనిమిదిన్నర పౌండ్ల బరువుతో తయారు చేశారు. దీనికి ఐదు స్పోక్స్ ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను ఇవి సూచిస్తాయి. నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలు. అయితే ఈ ఆస్కార్ ప్రతిమ ఎందుకు నగ్నంగా ఉంటుందంటే.. ఈ అవార్డును ఎంజీఎం స్టూడియో ఆర్డ్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ సృష్టించారు. ఆయన ఆస్కార్ అవార్డును డిజైన్ చేసే సమయంలో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్.. ఎమిలో ఫెర్నాండెజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి ఆ నటుడి ఆకారం నుంచి స్పూర్తి పొంది ఈ ప్రతిమను డిజైన్ చేశఆరు. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా ఉంటుంది. మొట్ట మొదటి ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం 1929లో మే 16న హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది.

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?