కన్న తండ్రి కర్కశత్వం.. ఉద్యోగం లేదనే మనస్తాపంతో11నెలల చిన్నారిని నదిలో విసిరేశాడు..

త‌న భార్య‌కు కూడా అబ‌ద్దం చెప్పాడు. చిన్నారి కనిపించకపోవడంతో అనుమానం వ‌చ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కన్న తండ్రి కర్కశత్వం.. ఉద్యోగం లేదనే మనస్తాపంతో11నెలల చిన్నారిని నదిలో విసిరేశాడు..
Narmada Canal
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 21, 2022 | 2:17 PM

పుట్టిన బిడ్డను కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే అతని పాలిట యముడిగా మారాడు. తన 11 నెలల చిన్నారిని కనికరం లేకుండా కడతేర్చాడు. ఉద్యోగం లేదన్న కారణంతో కన్నబిడ్డను నిర్దాక్షీణ్యంగా నదిలోకి విసిరేశాడు. ఈ ఘ‌ట‌న రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో చోటు చేసుకుంది.ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

నలోధార్ గ్రామానికి చెందిన ముకేశ్ అనే వ్య‌క్తి బీహార్ లోని ముజఫర్​పుర్​కు చెందిన ఉష అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహనంత‌రం వీరిద్ద‌రూ అహ్మదాబాద్​లో క‌లిసి జీవనం సాగిస్తున్నారు. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. ముకేశ్ అహ్మదాబాద్ లోని ఓ ప్ర‌ముఖ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. కానీ, ఆక‌స్మాత్తుగా ఉన్న ఉద్యోగం పోయింది. దాంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఉద్యోగం లేదన్న మనస్తాపంతో ప‌లుమార్లు ఆత్మహత్య ప్ర‌యత్నాలు చేశారు. కానీ, చివ‌రి క్ష‌ణాల్లో త‌న భార్య, కుమారుడు గుర్తుకు వ‌చ్చి.. విర‌మించుకున్నాడు. కానీ, కోరుకున్న జీవితాన్ని పోంద‌లేక‌.. బ‌తుకు భార‌మై.. మ‌రో ప్రయత్నంగా తన కుమారుడితో స‌హా కంకారియా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు.. కానీ, ఆ ప్రాంతంలో భారీ ఎత్తున జ‌నం ఉండడం వల్ల ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే చిన్నారిని త‌న తల్లితండ్రుల వద్ద వదిలి పెడతానని తీసుకువెళ్లిన చిన్నారిని ముకేశ్.. సిద్ధేశ్వర్ గ్రామంలోని నర్మదా నదిలోకి విసిరాడు. త‌న భార్య‌కు కూడా అబ‌ద్దం చెప్పాడు. చిన్నారి కనిపించకపోవడంతో అనుమానం వ‌చ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా..బాలుడిని తానే నదిలో విసిరేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. చిన్నారి కోసం నదిలో గాలించగా, ఘటనా స్థలానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామ సమీపంలో శుక్రవారం చిన్నారి మృతదేహాం లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి