NHB Recruitment 2022: నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (National Housing Bank).. ఒప్పంద ప్రాతిపదికన 14 చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

NHB Recruitment 2022: నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే..
Nhb
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 21, 2022 | 2:40 PM

National Housing Bank Chief Compliance Officer Recruitment 2022: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (National Housing Bank).. ఒప్పంద ప్రాతిపదికన 14 చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు డిగ్రీ, పీజీ, సీఏఐఐబీ, సీఎస్, సీఏ, ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు కేటగిరీ వారీ 40 నుంచి 63 వరకు ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 22, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్ధులకు రూ.850, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు రూ.175లు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.

పోస్టుల వివరాలు:

  • చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ పోస్టులు: 1
  • చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు: 1
  • చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పోస్టులు: 1
  • చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టులు: 1
  • ఆఫీసర్స్‌ ఫర్‌ సూపర్‌విజన్‌ పోస్టులు: 10

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.