SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో భారీగా స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు, ముఖ్యమైన తేదీలు ఇవే..
భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి పోస్టుల (Stenographer Grade - C Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ..
SSC Stenographer Grade ‘C’ & ‘D’ Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి పోస్టుల (Stenographer Grade – C Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య తాజా నోటిఫికేషన్‌లో వెల్లడించలేదు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీల ఆధారంగా పోస్టుల సంఖ్య వెల్లడిస్తారు. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 5, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/వికలాంగులు/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు గానూ 200 ప్రశ్నలకు 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.
- జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనీంగ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు
- జనరల్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు
- ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో 100 ప్రశ్నలకు 100 మార్కులు
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 5, 2022.
- ఆఫ్‌లైన్ దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 6, 2022.
- ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 6, 2022.
- రాత పరీక్ష తేదీ: నవంబర్, 2022
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.