AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Janmashtami: రాష్ట్ర సాహస క్రీడలో వృద్ధురాలి సత్తా.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..!

దహీ హండీ పోటీకి ఉన్న ఆదరణ దృష్ట్యా ముఖ్యమంత్రి దహీ హండీకి 'అడ్వెంచర్ గేమ్' హోదా కల్పించారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో దహీ హండీ పోటీల్లో పాల్గొనే వ్యక్తులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటా ప్రయోజనం పొందుతారు.

Krishna Janmashtami: రాష్ట్ర సాహస క్రీడలో వృద్ధురాలి సత్తా.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..!
Dahi Handi
Jyothi Gadda
|

Updated on: Aug 22, 2022 | 11:08 AM

Share

Krishna Janmashtami: కరోనావైరస్‌కు సంబంధించిన అన్ని ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మహారాష్ట్రలో ‘దహీ హండి'(ఉట్టి కొట్టే వేడుక) పండగను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ఒక్క ముంబైలోనే 4000కి పైగా ప్రాంతాల్లో దహీ హండీ నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ పెరుగుతో నిండిన కుండను పగలగొట్టడంపై భక్తులు పోటీపడ్డారు. ఈసారి, మహారాష్ట్రలోని ప్రసిద్ధ దహీ హండీ పోటీలో, దహీ హండీని బద్దలు కొట్టే సమూహాలకు లక్షల బహుమతుల నుండి విదేశాలకు వెళ్లే ఆఫర్‌లు కూడా ఇవ్వబడ్డాయి. మహారాష్ట్రలో దహీ హండీ పోటీకి ఉన్న ఆదరణ దృష్ట్యా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దహీ హండీకి ‘అడ్వెంచర్ గేమ్’ హోదా కల్పించారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో దహీ హండీ పోటీల్లో పాల్గొనే వ్యక్తులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటా ప్రయోజనం పొందుతారు.

ఈ క్రమంలోనే మహారాష్ట్రలో జరిగిన జన్మాష్టామి వేడుకలు, దహీ హండి కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వైరల్‌ అవుతున్న వీడియోలో ప్రజలు వెన్న లేదా, పెరుగుతో నింపిన మట్టి కుండలను పగులగొట్టడానికి మనుషులంతా కలిసి మానవ పిరమిడ్‌ల ఏర్పాటయ్యారు.ఈ వీడియోని శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇందులో మహారాష్ట్ర అంతటా అనేక రంగుల చిత్రాలు వీడియోలు కనిపిస్తు్న్నాయి. వాటి మధ్యలో ఒక వృద్ధ మహిళ మానవ పిరమిడ్‌ను అధిరోహించింది. (దహి హండీ) అందరిలో తాను ఉట్టికొట్టి ఔరా అనిపించింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో, నారింజ రంగు చీర ధరించిన ఒక మహిళ ఎత్తులో వేలాడదీసిన కుండను పట్టేసింది. ఉట్టికుండను తాను విజయవంతంగా పగుల గొట్టింది. ఈ వీడియో మొత్తం స్త్రీ మానవ పిరమిడ్ యొక్క శక్తిని నిరూపిస్తుంది. “వయస్సు అనేది కూడా లెక్కలోకి రాదు..వయసు కేవలం మనం లెక్కించే సంఖ్య మాత్రమే అంటూ ఈ వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చారు మేయర్‌ కత్రినా. #DahiHandifestival నిజంగా అందరినీ కలుపుకొని పోతుంది అంటూ..శివ సేన ఎంపీ ట్వీట్‌లో రాశారు.

వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ముంబైకి చెందిన దహీ హండి ఈవెంట్ వీడియోను అప్‌లోడ్ చేసారు. ఇది మరొక స్ఫూర్తిదాయకమైన ఘటన. విక్టోరియా మెమోరియల్‌ స్కూల్‌ ఫర్‌ ది బ్లైండ్‌లోని చూపులేని కొంతమంది విద్యార్థులు వేడుకలో పాల్గొన్న వీడియోను షేర్ చేస్తూ, “#జన్మాష్టమి సందర్భంగా విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో చదువుతున్న చూడలేని పిల్లలు ఈ ‘దహీ హండీ’ని ప్రదర్శించారు. నా భార్య కూడా అదే స్కూళ్లో పనిచేస్తున్నారని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి