‘ఎవరెస్ట్ శిఖరానికెక్కిన కోవిడ్ 19’, బేస్ క్యాంపులో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్, ఆసుపత్రికి తరలింపు

ఇండియాలో పెరిగిపోతున్న కోవిడ్ కేసుల ప్రభావం అత్యున్నత శిఖరమైన ఎవరెస్టు పైన కూడా పడింది. నేపాల్ లోని ఈ శిఖరానికి కూడా ఇది ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది.

'ఎవరెస్ట్ శిఖరానికెక్కిన కోవిడ్ 19', బేస్ క్యాంపులో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్, ఆసుపత్రికి తరలింపు
Covid Reaches Mount Everest
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 23, 2021 | 10:11 AM

ఇండియాలో పెరిగిపోతున్న కోవిడ్ కేసుల ప్రభావం అత్యున్నత శిఖరమైన ఎవరెస్టు పైన కూడా పడింది. నేపాల్ లోని ఈ శిఖరానికి కూడా ఇది ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన ఓ వ్యక్తిని ఈ శిఖర బేస్ క్యాంపులో కనుగొన్నారు. ఆ వ్యక్తిని హెలికాప్ట్ లో ఖాట్మండులోని ఆసుపత్రికి తరలించారు. ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్టు పర్వతంపైకి ఈ వైరస్’ ‘చేరుకోవడం’ అత్యంత ఆశ్చర్యకరం, దారుణం కూడా అంటున్నారు. అయితే ఎత్తయిన పర్వతాలను ఎక్కుతున్నప్పుడు కొంతమందికి ‘పల్మనరీ ఎడిమా’ అనే లక్షణాలు, సిక్ నెస్ కనబడుతాయట. నిజానికి ముగ్గురు పర్వతారోహకులకు కోవిడ్ పాజిటివ్ సోకిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. వీరిని వెంటనే బేస్ క్యాంపు నుంచి తరలించినట్టు పేర్కొంది.

ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో తెలియడంలేదని, చాలానే ఉంటాయని భావిస్తున్నామని ఓ సాహస యాత్రా బృంద నేత ఒకరు అన్నారు. నేపాల్ లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ యాత్రా బృందం ఈసారి తమ ఎవరెస్టు పర్వతారోహణ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. అయితే నేపాల్ టూరిజం శాఖ మాత్రం పలువురు విదేశీ పర్వతారోహకులకు పర్మిట్లు ఇచ్చింది.  దాదాపు 377 మందికి అనుమతి లభించింది. 2019 లో 11 మంది పర్వతారోహకులు మరణించారు. కాగా- చాలా వరకు వైరస్ లక్షణాలు ఆల్టిట్యుడ్ సిక్ నెస్ ని, సాధారణంగా పర్వతారోహకులను  వేధించే ‘కుంభ్ దగ్గును ‘ పోలి ఉంటాయని అంటున్నారు.  నేపాల్ లో సైతం కేసులు పెరిగిపోతున్నప్పటికీ అక్కడి ప్రభుత్వం ఈ కేసులు పెరగకుండా ముందు జాగత్త చర్యలు తీసుకుంటోంది.

Latest Articles