Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Burger King: యాడ్‌లో కనిపించిన చికెన్.. బర్గర్‌లో ఏమైంది.. పాస్ట్‌ఫుడ్ దిగ్గజం బర్గర్ కింగ్‌పై కోర్టులో కేసు

Complaint Against Burger King: ప్రపంచవ్యాప్తంగా బర్గర్లు, శాండ్‌విచ్‌లు, పిజ్జా, చికెన్ రోల్స్ లాంటి జంక్ ఫుడ్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. ముఖ్యంగా కంపెనీల పేర్లను బట్టి ఈ జంక్ ఫుడ్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆహార ప్రియులు.

Burger King: యాడ్‌లో కనిపించిన చికెన్.. బర్గర్‌లో ఏమైంది.. పాస్ట్‌ఫుడ్ దిగ్గజం బర్గర్ కింగ్‌పై కోర్టులో కేసు
Burger King
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 05, 2022 | 2:01 PM

Complaint Against Burger King: ప్రపంచవ్యాప్తంగా బర్గర్లు, శాండ్‌విచ్‌లు, పిజ్జా, చికెన్ రోల్స్ లాంటి జంక్ ఫుడ్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. ముఖ్యంగా కంపెనీల పేర్లను బట్టి ఈ జంక్ ఫుడ్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆహార ప్రియులు. అయితే.. పాస్ట్‌ఫుడ్ కంపెనీల్లో బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.. బర్గర్ కింగ్.. ఈ కంపెనీ జంక్ ఫుడ్ అంటే చాలా మంది లొట్టలేసుకుంటూ మరి తింటారు. తాజాగా ఈ కంపెనీకి చుక్కెదురైంది. ఈ కంపెనీ యాడ్స్‌లో ఒకటి చెప్పి.. సరైనా క్వాంటిటి ఇవ్వకుండా కస్టమర్లను మోసం చేస్తుందంటూ పలువురు అమెరికన్ కోర్టు (US Court) మెట్లక్కారు. వాణిజ్య ప్రకటనలో 35% ఎక్కువ చికెన్ పెట్టినట్టు బర్గర్ చూపించి వినియోగదారులను మోసం చేస్తుందంటూ ఫ్లోరిడా వాసి కోర్టులో దావా వేశాడు. బర్గర్ కింగ్ తన ప్రకటనల ద్వారా కస్టమర్లను తప్పుదారి పట్టించిందని పేర్కొంటూ యునైటెడ్ స్టేట్స్‌లో మొత్తం 100 మంది దావా వేశారు. సదరన్ ఫ్లోరిడాలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో.. ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం తన బర్గర్‌ల పరిమాణాన్ని కేవలం చిత్రాలలోనే పెంచిందంటూ వారు ఆరోపించారు. క్వాంటిటి సరైన మొత్తంలో లేదని ఆరోపించారు.

26-పేజీల క్లాస్-యాక్షన్ ఫిర్యాదులో 2017లో బర్గర్ కింగ్ ఈ పద్ధతిని అవలంభించిందని, కానీ ప్రచారం చేసినంతగా క్వాంటిటి లేదని పేర్కొన్నారు. వొప్పర్ – బర్గర్ కింగ్ ఉత్పత్తులు చిత్రాలలో చూపిన దానికంటే దాదాపు 35 శాతం తక్కువగా ఉన్నట్లు పిటిషన్‌లో పేర్కొ్న్నారు. మెను – ఐటెమ్‌ల పక్కపక్కన పోలికలు.. వాటి ప్రకటన చిత్రాలను కూడా ఫిర్యాదు దారులు కోర్టుకు సమర్పించారు. బర్గర్ కింగ్ ప్రచారం చేస్తున్న మాదిరిగా.. బర్గర్‌లు దాదాపు 35% పరిమాణంలో పెద్దవిగా ఉండి.. రెట్టింపు మాంసాన్ని కలిగి ఉన్నట్లు కనిపించేలా బన్‌పై మాంసం పట్టీలు, పదార్థాలను యాడ్‌లో చూపించారని పేర్కొన్నారు. బర్గర్ కింగ్చ ఇతర ఫాస్ట్‌ఫుడ్ చైన్‌లు తమ మెను ఐటెమ్‌లను వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ప్రచారం చేయాలని పిటిషనర్లకు కోర్టుకు విన్నవించారు. ఆహార పదార్థాలతో బర్గర్ కింగ్ తప్పుదోవ పట్టిస్తుందని చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కాగా.. బర్గర్ పరిణామంపై కంపెనీ ఇప్పటివరకు స్పందించలేదు.

కాగా.. బర్గర్ కింగ్ 1953లో జాక్సన్‌విల్లే, ఫ్లోరిడాలో చిన్న బర్గర్ చైన్‌గా కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ తర్వాత ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా విస్తరించింది. ప్రస్తుతం అనేక దేశాల్లో బర్గర్ కింగ్ ప్రాంచైజీలు ఉన్నాయి.

Also Read:

Ukraine crisis: ఉక్రెయిన్‌ విద్యార్థుల విద్యారుణ బకాయిలు రూ.121 కోట్లు మాఫీ చేయాలా? వద్దా?

Covid 4th Wave: జర జాగ్రత్త! కోవిడ్ కొత్త వైరస్‌ లక్షణాలు ఇవే! 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి..