AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine crisis: ఉక్రెయిన్‌ విద్యార్థుల విద్యారుణ బకాయిలు రూ.121 కోట్లు మాఫీ చేయాలా? వద్దా?

ఉక్రెయిన్‌లో విద్యాభ్యాసం కోసం డిసెంబరు 31, 2021 నాటికి 1,319 మంది విద్యార్థులు బ్యాంకుల నుంచి రూ.121.61 కోట్లమేర విద్యారుణాలు..

Ukraine crisis: ఉక్రెయిన్‌ విద్యార్థుల విద్యారుణ బకాయిలు రూ.121 కోట్లు మాఫీ చేయాలా? వద్దా?
Nirmala Sitharaman
Srilakshmi C
|

Updated on: Apr 05, 2022 | 1:21 PM

Share

Aassess impact of conflict on education loans: ఉక్రెయిన్‌లో విద్యాభ్యాసం కోసం డిసెంబరు 31, 2021 నాటికి 1,319 మంది విద్యార్థులు బ్యాంకుల నుంచి రూ.121.61 కోట్లమేర విద్యారుణాలు తీసుకున్నారని, వీటిని ఏం చేయాలన్న అంశంపై పరిస్థితులు కుదుటపడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) సోమవారం పార్లమెంటుకు తెలిపారు. ఏప్రిల్‌ 4న లోక్‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు బదులిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు 22,500 మంది భారతీయులు ఉక్రెయిన్‌ (Ukraine) నుంచి సురక్షితంగా స్వదేశం తిరిగి వచ్చారు. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సమాచారం ప్రకారం 2021 డిసెంబరు 31 నాటికి ఉక్రెయిన్‌లో విద్యాభ్యాసం కోసం 1,319 మంది విద్యార్థులు రూ.121.61 కోట్ల విద్యారుణాలు తీసుకున్నారు. ప్రస్తుత అనిశ్ఛితి పరిస్థితులను ప్రభుత్వం సూక్ష్మంగా గమనిస్తోంది. అవి కుదుటపడిన తర్వాతే పరిష్కార మార్గాలను పరిగణనలోకి తీసుకుంటాం. భారత్‌కు తిరిగి వచ్చిన విద్యార్థుల రుణ బకాయిలపై యుద్ధం ప్రభావాన్ని అంచనా వేయాలని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ను కోరుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

Also Read:

Covid 4th Wave: జర జాగ్రత్త! కోవిడ్ కొత్త వైరస్‌ లక్షణాలు ఇవే! 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి..