Covid 4th Wave: జర జాగ్రత్త! కోవిడ్ కొత్త వైరస్‌ లక్షణాలు ఇవే! 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి..

కరోనా పీడ ఇంకా విరగడవ్వలేదు. రోజుకో కొత్త రూపమెత్తి హడల్‌ పుట్టిస్తోంది. ఒమిక్రాన్‌ స్ట్రెయిన్స్ (బీఏ 1, బీఏ2) కాంబినేషన్‌తో పుట్టుకొచ్చిన కొత్త వైరస్‌ 'XE Omicron' సంక్రమణ వేగం మూడో వేవ్ కంటే 10 రెట్లు ఎక్కవని, ఇప్పటికే..

Covid 4th Wave: జర జాగ్రత్త! కోవిడ్ కొత్త వైరస్‌ లక్షణాలు ఇవే! 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి..
Xe Omicron
Follow us

|

Updated on: Apr 05, 2022 | 11:52 AM

Covid 4th Wave Symptoms: కరోనా పీడ ఇంకా విరగడవ్వలేదు. రోజుకో కొత్త రూపమెత్తి హడల్‌ పుట్టిస్తోంది. ఒమిక్రాన్‌ స్ట్రెయిన్స్ (బీఏ 1, బీఏ2) కాంబినేషన్‌తో పుట్టుకొచ్చిన కొత్త వైరస్‌ ‘XE Omicron’ ఉనికిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గత వారం తెలియజేసింది. దీని సంక్రమణ వేగం మూడో వేవ్ కంటే 10 రెట్లు ఎక్కవని, ఇప్పటికే 600కుపైగా కేసులు నమోదైనట్లు యావత్‌ ప్రపంచాన్ని హెచ్చరించింది. ఐతే కొత్త వేరియంట్‌ యూకేలో జనవరి 19న తొలిసారిగా బయటపడిన సంగతి తెలిసిందే. ఈ వైరస్‌కు సంబంధించిన లక్షణాలను కూడా నిపుణులు వెల్లడించారు. 3 హైబ్రిడ్ కోవిడ్ వేరియంట్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నట్లు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అవే XD, XF, XE వేరియంట్లు.

XE ఒమిక్రాన్ లక్షణాలు.. వ్యాక్సిన్ స్టేటస్, రోగనిరోధక శక్తిని బట్టి కోవిడ్-19 కొత్త వేరియంట్‌ లక్షణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉన్నట్లు తెలుస్తోంది. జ్వరం, గొంతు నొప్పి, గొంతులో మంట, దగ్గు, జలుబు, చర్మం దురద, చర్మం రంగు మారడం, జీర్ణకోశ సమస్యలవంటి ఇతర లక్షణాలు ప్రాథమికంగా కనిపిస్తున్నాయి. వ్యాధి తీవ్రత పెరిగితే గుండె జబ్బులు, దడ, నరాల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమౌతుందని నిపుణులు చెబుతున్నారు.

మనదేశంలో పరిస్థితి ఇలా.. ఒమిక్రాన్ వేరియంట్ (థర్డ్‌ వేవ్) ప్రారంభమైన తర్వాత మన దేశంలో కోవిడ్ -19 పాజిటివ్‌ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నప్పటికీ, ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా నాలుగోవేవ్‌ దాడి చేసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి కోవిడ్‌ ఉధృతి ప్రారంభమైనప్పటి నుంచి ఢిల్లీ, మహారాష్ట్రలలో గరిష్ఠ స్థాయిలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగుపడటంతో మాస్క్ ధరించడం మంచిదే కానీ తప్పనిసరేంకాదని ఈ రెండు రాష్ట్రాలు ప్రకటించాయి. ఐతే కోవిడ్‌ ఇప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదనేది జగమెరిగిన సత్యం. యూఎస్, యూకే, చైనా, హాంకాంగ్‌ దేశాల్లో కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. ఇండియాకు ఈ పరిస్థితి ఎదురుకాదనే గ్యారెంటీ ఏమీ లేదు. అందుకే వైరస్ పూర్తిగా తగ్గిపోయే వరకు కోవిడ్ ప్రోటోకాల్‌ కనీసం ఒక ఏడాది పాటైనా కొనసాగిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి కోవిడ్ నాలుగో వేవ్‌పై అప్రమత్త ఎంతైనా అవసరం.

Also Read:

ESIC Recruitment 2022: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌లో స్పెషలిస్టు గ్రేడ్‌ – 2 ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు..

Latest Articles