Coronavirus: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్నంటే..?
India Covid-19 Updates: దేశంలో థర్డ్‌వేవ్ అనంతరం కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య వేయి వరకు నమోదవుతున్నాయి. గత రెండు రోజుల నుంచి
India Covid-19 Updates: దేశంలో థర్డ్‌వేవ్ అనంతరం కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య వేయి వరకు నమోదవుతున్నాయి. గత రెండు రోజుల నుంచి వేయి దిగువన నమోదైన కరోనా కేసులు తాజాగా స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,086 కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోల్చుకుంటే.. మంగళవారం దాదాపు 400 కేసులు పెరిగాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి (Coronavirus) కారణంగా నిన్న 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 11,871 (0.03%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.23 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,30,925 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,21,487 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 1,198 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,24,97,567 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉంది.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 185.04 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా నిన్న 4,81,374 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 79.20 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.
India reports 1,086 fresh #COVID19 cases, 1,198 recoveries, and 71 deaths in the last 24 hours.
Active cases: 11,871 (0.03%) Death toll: 5,21,487 Daily positivity rate: 0.23%
185.04 cr vaccine doses have been administered so far pic.twitter.com/LZVMDmUsrh
— ANI (@ANI) April 6, 2022
Akso Read: