BEE Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ..బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీలో రూ.125000ల జీతంతో జాబ్స్! అర్హతలివే..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE).. ఒప్పంద ప్రాతిపదికన సెక్టార్ ఎక్స్‌పర్ట్, కన్సల్టెంట్ (Sector Expert Posts) పోస్టుల భర్తీకి..
Bureau of Energy Efficiency Sector Expert Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE).. ఒప్పంద ప్రాతిపదికన సెక్టార్ ఎక్స్‌పర్ట్, కన్సల్టెంట్ (Sector Expert Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల వివరాలు: సెక్టార్ ఎక్స్‌పర్ట్, కన్సల్టెంట్ పోస్టులు
విభాగాలు: క్లైమెట్ ఛేంజ్, బిల్డింగ్, రెగ్యులేషన్ ఎన్‌ఫోర్స్మెంట్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. 64 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.1,00,000 ల నుంచి రూ.1,25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ ఇంజనీరింగ్/పీజీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/కామర్స్/ఫైనాన్స్/ఎమ్మెస్సీ/ఎమ్‌ఏ ఎకనామిక్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 5 నుంచి 25 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Secretary, Bureau of Energy Efficiency, 4th Floor, Sewa Bhawan, R. K. Puram, Sector-1, New Delhi-110066
దరఖాస్తులకు చివరి తేదీ: మే 3, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: