AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: యూట్యూబ్ చూసి రంగంలో దిగారు.. ఓన్లీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లే కొట్టేస్తారు.. చివరకు

Royal Enfield bikes stealing: అందరూ ఫ్రెండ్స్.. ఏడుగురూ కూడా ఎంబీఏ, ఇంజినీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదువుకున్నారు.. సినిమాలు చూసి విలాసవంతమైన జీవితం గడపాలని అనుకున్నారు.

Crime News: యూట్యూబ్ చూసి రంగంలో దిగారు.. ఓన్లీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లే కొట్టేస్తారు.. చివరకు
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Apr 06, 2022 | 8:54 AM

Share

Royal Enfield bikes stealing: అందరూ ఫ్రెండ్స్.. ఏడుగురూ కూడా ఎంబీఏ, ఇంజినీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదువుకున్నారు.. సినిమాలు చూసి విలాసవంతమైన జీవితం గడపాలని అనుకున్నారు. దీనికోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అదికూడా కేవలం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు మాత్రమే దొంగతనం చేయడం ప్రారంభించారు. కట్‌చేస్తే.. కర్ణాటక పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. బెంగళూరు నగరంలో ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మంగళవారం బనశంకరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.68 లక్షల విలువైన 30 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు (Chittoor District) జిల్లాకు చెందిన విజయ్, హేమంత్, గుణశేఖర్ రెడ్డి, భానుమూర్తి, పురుషోత్తం, కార్తీక్, కిరణ్.. స్నేహితులు. వీరంతా ఎంబీఏ, ఇంజనీరింగ్ కోర్సులను పూర్తిచేశారు. వయసు 26 నుంచి 28 ఏళ్ల మధ్య ఉంటుంది.

లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగం రాలేదని తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. అయితే.. సినిమాలు చూసి తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని ఆశ పడ్డారు. అయితే.. బైక్ దొంగిలించేందుకు యూట్యూబ్‌ని చూసి.. కేవలం బుల్లెట్ వాహనాలనే దొంగతంన చేసేవారని పోలీసులు తెలిపారు. వాటిని దొంగిలించి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ధరకు అమ్మేవారు. అలా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారని పోలీసులు తెలిపారు. ఇటీవల బనశంకరి పోలీస్ స్టేషన్‌లో బైక్ దొంగతనం కేసు నమోదు కాగా.. దర్యాప్తు చేసిన పోలీసు బృందం ఏడుగురు నిందితులను అరెస్టు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వీరిపై 27 కేసులు నమోదయ్యాయని.. విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Sharad Pawar: ఢిల్లీలో శరద్ పవార్ విందు రాజకీయం.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, సంజయ్ రౌత్, గడ్కరీ సైతం హాజరు!

Watch Video: ఏం చేసుకుంటారో చేసుకోండి.. పోలీసులపై రెచ్చిపోయిన ఎంఐఎం కార్పొరేటర్‌.. రాజాసింగ్ ఏమన్నారంటే..?