Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఏం చేసుకుంటారో చేసుకోండి.. పోలీసులపై రెచ్చిపోయిన ఎంఐఎం కార్పొరేటర్‌.. రాజాసింగ్ ఏమన్నారంటే..?

MIM Corporator Ghousuddin Taha warning to police: హైదరాబాద్‌లో రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులకు ఓ మజ్లిస్‌ కార్పొరేటర్ వార్నింగ్ ఇచ్చాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నోరుపారేసుకున్నాడు.

Watch Video: ఏం చేసుకుంటారో చేసుకోండి.. పోలీసులపై రెచ్చిపోయిన ఎంఐఎం కార్పొరేటర్‌.. రాజాసింగ్ ఏమన్నారంటే..?
Mim
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 06, 2022 | 8:27 AM

MIM Corporator Ghousuddin Taha warning to police: హైదరాబాద్‌లో రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులకు ఓ మజ్లిస్‌ కార్పొరేటర్ వార్నింగ్ ఇచ్చాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నోరుపారేసుకున్నాడు. ఓవర్‌నైట్‌ హోటల్‌ తెరిచి ఉంచడాన్ని.. పోలీసులు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన కార్పొరేటర్ గౌసుద్దీన్ తాహా కనీస మర్యాద కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట అనేశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి నాలుగు గంటల ప్రాంతంలో (బుధవారం తెల్లవారుజామున) జరిగింది. రంజాన్‌ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషిరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామంటూ భోలక్‌పూర్ కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ తాహా.. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు స్పష్టంచేశాడు. అయితే.. తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని.. సమయానికి హోటళ్లను మూసివేయాలని పోలీసులు చెప్పబోతే.. మీరు వంద రూపాయలకు పనిచేసే మనుషులు.. ఇక్కడకు కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ వచ్చాడని.. మీ ఎస్‌ఐ, సీఐకి చెప్పండి అంటూ రుబాబు ప్రదర్శించాడు. రంజాన్ నెలపాటు ఇటు వైపు రావొద్దంటూ పోలీసులకు చెప్పాడు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు.

హైదరాబాద్‌ సిటీలో మజ్లిస్‌ వాళ్లకు ఒక రూలు, ఇతరులకు మరో రూల్ ఉందా అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులను ప్రశ్నించారు. అందరికీ ఒకే రూల్‌ అమలు చేయడం చేతకాకపోతే… మజ్లిస్‌ వాళ్లను మాకు అప్పగించండి.. వాళ్లకు అర్థమయ్యే భాషలో తాము చెప్తామంటూ కామెంట్ చేశారు. 30 రోజుల పాటు అతని ప్రాంతంలోకి ప్రవేశించవద్దంటూ డ్యూటీలో ఉన్న అధికారులను ఎంఐఎం కార్పొరేటర్ హెచ్చరించాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డీజీపీ, హైదరాబాద్ సీపీకి ట్యాగ్ చేశారు.

కాగా.. ఈ ట్విట్‌కు హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. మజ్లీస్ కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ తాహాపై ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో 353, 506 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా.. నైట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ అనుచిత వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుం నెట్టింట వైరల్ అవుతోంది.

-నూర్ మహమ్మద్, టీవీ9 తెలుగు ప్రతినిధి, హైదరాబాద్

Also Read:

Minister KTR: మంత్రి కేటీఆర్‌తో ఆర్మీ ఉన్నతాధికారుల సమావేశం.. రోడ్ల మూసివేతపై చర్చ..

TELANGANA ELECTIONS: ముందస్తు మోతకు పార్టీల కదనోత్సాహం.. గులాబీ పార్టీని ఢీకొట్టేందుకు బరిలోకి జాతీయ పార్టీలు