Attention: తెలంగాణ ఎంసెట్ 2022 దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం! ఇలా దరఖాస్తు చేసుకోండి..
TS EAMCET 2022 దరఖాస్తు ప్రక్రియ నేటి (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు..
TS EAMCET2022 application last date: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2022 (TS EAMCET 2022) దరఖాస్తు ప్రక్రియ నేటి (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్eamcet.tsche.ac.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఉన్నత విద్యామండలి మార్చి 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి మే 28 (ఆలస్య రుసుము లేకుండా) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.800. ఎస్సీ, ఎస్టీలకు రూ.400 ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.400లు చెల్లించవల్సి ఉంటుంది. జులై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అలాగే జులై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో, CBT మోడ్‌లో 3 గంటల పాటు నిర్వహించబడుతుంది. కాగా ఈ ఏడాది కూడా ఎంసెట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీకిగాను డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్) విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
TS EAMCET 2022కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజీలో కనిపించే “TS EAMCET 2022 registration” లింక్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
- అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, పేర్కొన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- సబ్‌మిట్ చేసేముందు అన్ని వివరాలు చెక్ చేసుకుని, చివరిగా సబ్‌మిట్ చేయాలి.
- పూరించిన దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని, హార్డాకాపీని ప్రింట్ ఔట్ తీసుకోవాలి.
Also Read: