Minister KTR: మంత్రి కేటీఆర్‌తో ఆర్మీ ఉన్నతాధికారుల సమావేశం.. రోడ్ల మూసివేతపై చర్చ..
హైదరాబాద్‌లో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత అంశంపై మంత్రి కేటీఆర్‌తో ఆర్మీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. నానక్‌రామ్ గూడ హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి..
హైదరాబాద్‌లో కంటోన్మెంట్ రోడ్ల(Secunderabad Cantonment Roads) మూసివేత అంశంపై మంత్రి కేటీఆర్‌తో (Minister KTR)ఆర్మీ ఉన్నతాధికారులు(Army officials) సమావేశమయ్యారు. నానక్‌రామ్ గూడ హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో(GHMC) ఈ భేటీ జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్‌కు దక్షిణ భారత లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ హామీ ఇచ్చారు. ఆర్మీ, జీహెచ్ఎంసీ( GHMC) అధికారులు కలిసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్‌లో భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం, విస్తరణ చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఆర్మీ ప్రాంతాల్లో సైతం మౌలిక వసతుల కల్పించామన్నారు. అయితే స్కై వేల నిర్మాణం కోసం రక్షణ శాఖ మంత్రులను, ఉన్నతాధికారులను చాలాసార్లు కలిసి విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదన్నారు. కంటోన్మెంట్‌లో తరచూ రోడ్లను మూసివేయడంతో ప్రజలకు పడుతున్న కష్టాలను మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
ప్రజల అభివృద్ధి కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ(GHMC), హెచ్ఎండీఏ(HMDA)తో కలిసి పని చేస్తామని మేజర్ జనరల్ అరుణ్ బృందం మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చింది. మెహదీపట్నం చౌరస్తాలో స్కైవాక్, ఇతర నిర్మాణాలకు సహకరిస్తామని చెప్పింది. ఆర్మీకి సంబంధించిన ప్రతి విషయంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవప్రదమైన దృక్పథంతో వ్యవహరిస్తుందన్నారు మంత్రి కేటీఆర్.
మహేశ్వరం E-సిటీలో విప్రో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 300 కోట్లతో విప్రో పరిశ్రమ ఏర్పాటైంది. విప్రో ద్వారా 900 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. టీఎస్‌ఐపాస్ విశిష్టతను వివరించారు మంత్రి కేటీఆర్. పరిశ్రమల స్థాపనకు వెనువెంటనే అనుమతి ఇస్తున్నామని చెప్పారు. ఇలాంటి విధానం దేశంలో మరెక్కడా లేదన్నారు.
MA&UD Minister @KTRTRS held a review meeting with senior Army officials from Secunderabad Cantonment Area. During the meeting, the Minister discussed about various problems including the long pending road closure issue pertaining to Secunderabad Cantonment Area. pic.twitter.com/iXqQOEWtb8
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 5, 2022
ఇవి కూడా చదవండి: Viral Video: ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో.. అమ్మను ముద్దాడింది.. వెళ్లిపోయింది.. వీడియో చూస్తే మీరు అదే అంటారు..
Drugs Case: హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. విచారణ ముమ్మరం చేసిన నార్కోటిక్ వింగ్..
Sanjay Raut: శివసేన ఎంపీ ఆస్తులపై ఈడీ దాడులు.. మనీలాండరింగ్ చేసినట్లుగా ఆరోపణలు..