Sanjay Raut: శివసేన ఎంపీ ఆస్తులపై ఈడీ దాడులు.. మనీలాండరింగ్ చేసినట్లుగా ఆరోపణలు..
Money Laundering Scam: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేస్తోంది. అలీబాగ్, దాదర్‌లోని సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జప్తు చేసిన సొత్తులో అలీబాగ్‌లోని ఎనిమిది ప్లాట్లు, దాదర్‌లోని..
శివసేన (Shiva Sena)రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు(Sanjay Raut) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేస్తోంది. అలీబాగ్, దాదర్‌లోని సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జప్తు చేసిన సొత్తులో అలీబాగ్‌లోని ఎనిమిది ప్లాట్లు, దాదర్‌లోని ఒక ఫ్లాట్ ఉన్నాయి. ఈడి ప్రకారం సంజయ్ రౌత్ మనీలాండరింగ్ నుంచి వచ్చిన డబ్బుతో ఆస్తిని కొనుగోలు చేసినట్లుగా తెలస్తోంది. గత కొన్ని రోజులుగా కేంద్ర దర్యాప్తు సంస్థ మహారాష్ట్రలోని ఆర్ధిక నేరస్థులపై ఉక్కుపాదం మోపుతోంది.
గోరేగావ్‌లోని పట్రాచల్ భూ కుంభకోణంలో ప్రవీణ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. వీరి విచారణలో వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. పత్రాచల్ భూముల కేసులో 1034 కోట్ల కుంభకోణం. ఈ డబ్బులో కొంత సంజయ్ రౌత్‌కు ఇచ్చినట్లుగా అతను అంగీకరించాడు.
అదే డబ్బుతో సంజయ్ రౌత్ అలీబాగ్‌లో ఓ ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ప్లాట్ల విలువ దాదాపు 60 లక్షలు ఉంటుందని తెలింది. స్థానికులను బెదిరించి తక్కువ డబ్బుకు ప్లాట్లు కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. తమను బెదిరించి తమ ఆస్తులు సంజయర్ రౌత్ లాక్కున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
Enforcement Directorate attached Shiv Sena leader Sanjay Raut’s property in connection with Rs 1,034 crore Patra Chawl land scam case, the agency said.
(File pic) pic.twitter.com/ocaQgh2Jnt
— ANI (@ANI) April 5, 2022
ఇదిలావుంటే.. మహావికాస్ అఘాడీకి చెందిన పలువురు నాయకులపై ED ఫోకస్ చేసింది. దాంతో ప్రతిపక్షం, అధికార పక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోని ఇతర పార్టీల నేతలను వేధించేందుకు అధికార బీజేపీ కేంద్ర యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని మహారాష్ట్ర నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో ప్రముఖులలో ఒకరు సంజయ్ రౌత్. ఈడీ నేతలు నేరుగా బీజేపీ నేతలతో కలిసి ఈ దాడులు నిర్వహిస్తున్నారని సంజయ్ రౌత్ తీవ్రంగా ఆరోపించారు.
ఇవి కూడా చదవండి: Bikshamaiah Goud: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే.. కాషాశం కండువా కప్పి ఆహ్వానించిన తరుణ్‌చుగ్
Kishan Reddy: ప్రధాని మోదీ చొరవతోనే కట్టడాలకు యునెస్కో గుర్తింపు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి