Gujarat Election 2022: ఎన్నికలకు ముందే గుజరాత్‌లో కాంగ్రెస్‌కు షాక్.. ఆప్‌లో చేరనున్న కీలక నేత..?
Ahmed Patel's son Faisal: గుజరాత్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ సీనియర్ నేత పుత్ర రత్నం పార్టీ మారే ఆలోచనల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్..
గుజరాత్ ఎన్నికలకు(Gujarat election 2022) ముందే కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ సీనియర్ నేత పుత్ర రత్నం పార్టీ మారే ఆలోచనల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్(Congress leader) నేత అహ్మద్ పటేల్ తనయుడు( Ahmed Patel’s son) ఫైసల్ పటేల్(Faisal Patel) కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. జాతీయ స్థాయి నాయకులతోపాటు రాష్ట్ర నాయకత్వం కూడా ఎవరూ పట్టించుకోక పోవడంతో ఫైసల్ పటేల్ మరో దారి వెతుకునే ప్రయాత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితిలో అతను రాబోయే కాలంలో పార్టీని వీడే అవకాశం ఉంది. అతను తన తాజా ట్వీట్‌లో ఈ విషయాన్ని సూచించారు. తన ట్విట్టర్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఫైసల్ పటేల్. ‘నేను వేచి ఉండి అలసిపోయాను. అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. తమ వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేశాము. ‘ అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అహ్మద్ పటేల్ దీర్ఘకాలిక అనారోగ్యంతో నవంబర్ 2020లో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుటికి రెండేళ్ల తర్వాత కూడా పార్టీ నాయకత్వం ఎవరూ అతడిని కలిసినట్లుగా లేదు. దీంతో ఫైసల్ పటేల్ కాంగ్రెస్‌ను వీడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌లోనే ఫైసల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఆ తర్వాత ఆయన ఆప్‌లో చేరతారని ఊహాగానాలు మొదలయ్యాయి.
Tired of waiting around. No encouragement from the top brass. Keeping my options open
— Faisal Patel (@mfaisalpatel) April 5, 2022
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విధేయుడిగా అహ్మద్ పటేల్‌కు పేరుంది. గాంధీ కుటుంబం తర్వాత పార్టీలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడ్డారు. అటువంటి పరిస్థితిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతని కుమారుడు ఫైసల్ పటేల్ కాంగ్రెస్ నాయకత్వంపై ప్రశ్నలు సందించడంతో ఆ రాష్ట్ర పార్టీ నాయకులు ఆందోళన మొదలైంది. గుజరాత్‌లో గత 27 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ తిరిగి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి: Viral Video: ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో.. అమ్మను ముద్దాడింది.. వెళ్లిపోయింది.. వీడియో చూస్తే మీరు అదే అంటారు..
Drugs Case: హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. విచారణ ముమ్మరం చేసిన నార్కోటిక్ వింగ్..
Sanjay Raut: శివసేన ఎంపీ ఆస్తులపై ఈడీ దాడులు.. మనీలాండరింగ్ చేసినట్లుగా ఆరోపణలు..