Viral Video: ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో.. అమ్మను ముద్దాడింది.. వెళ్లిపోయింది.. వీడియో చూస్తే మీరు అదే అంటారు..
వృద్ధ మహిళ రోజూ ఉదయాన్నే కోతులకు రొట్టెలు తినిపించేది. కానీ ఆమె అనారోగ్యంతో రెండు రోజులుగా రొట్టెలు ఇవ్వలేకపోయింది. దీంతో ఒక కోతి వాళ్ల ఇంటికి వచ్చింది.
ప్రపంచంలో వివిధ రకాల జంతువులు నివసిస్తున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే మానవులలో వారితో జీవించడానికి ఇష్టపడే జంతువులు. వీటిలో కుక్కలు, పిల్లుల పేర్లు మొదటి స్థానంలో ఉన్నాయి. ఇప్పటికీ కొద్ది మంది మాత్రమే పిల్లులను పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఆ వీడియోలు ఇప్పుడు తెగ వైరల్(Viral Video) అవుతున్నాయి. కానీ కుక్కల పట్ల వారికి ఉండే ప్రేమ అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక ఇంట్లో పెంపుడు కుక్క తప్పకుండా కనిపిస్తుంది. నిజానికి జంతువులు కూడా ప్రేమ కోసం ఆకలితో ఉంటాయి. అందుకే వాటికి మనుషులతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. జంతువులకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ .. ఈ రోజుల్లో ఒక కోతికి సంబంధించిన వీడియో చాలా వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.
నిజానికి, ఒక వృద్ధ మహిళ రోజూ ఉదయాన్నే కోతులకు, కొండముచ్చులకు రొట్టెలు తినిపించేది. కానీ ఆమె అనారోగ్యంతో రెండు రోజులుగా రొట్టెలు ఇవ్వలేకపోయింది. దీంతో ఒక కోతి వాళ్ల ఇంటికి వచ్చింది. నేరుగా వృద్ధ మహిళ వద్దకు వెళ్లి ఆమె పరిస్థితిని చూసింది. ఆప్యాయంగా పలకరించింది. ఆ తర్వాత ఆమె త్వరగా కోలుకోవాలని ఆమెను హత్తుకుంది. ఆ కొండెంగ ఎలా తన ప్రేమను పంచుకుందో ఈ వీడియోలో చూడవచ్చు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.
रोज सुबह एक वृद्घा बंदरों को रोटी देती थी. बीमार होने की वजह से दो दिन रोटी नहीं दे पाई तो बंदर उनका हाल जानने के लिए उसके पास आए.
दिल को छूने वाले क्षण.❤️ pic.twitter.com/K4TdCSKL3w
— Awanish Sharan (@AwanishSharan) April 2, 2022
ఈ హార్ట్ టచ్చింగ్ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ‘ప్రతిరోజు ఉదయం ఒక వృద్ధురాలు కోతులకు రొట్టెలు ఇచ్చేది’ అనే క్యాప్షన్ జోడించారు. అనారోగ్యం కారణంగా రెండు రోజులుగా రొట్టెలు ఇవ్వలేక పోవడంతో కోతులు ఆమె పరిస్థితి తెలుసుకుని అక్కడికి చేరుకున్నాయి. తమ ప్రేమను ఇలా పంచుకున్నాయనినెటిజన్లు కామెంట్ల రూపంలో పోస్ట్ చేశారు. ఈ 36 సెకన్ల వీడియోకు ఇప్పటివరకు 6 లక్షల 82 వేలకు పైగా చూశారు. 60 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు.
ఇవి కూడా చదవండి: Stock Market: రంకెలేసిన బుల్.. 3 నెలల తర్వాత 30 లక్షల కోట్ల లాభం.. ఫుల్ జోష్‌లో ఇన్వెస్టర్లు ..
Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఓ పిచ్చోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని రెండో భార్య..