Viral Video: ఇదేం వెర్రి వేషాలు సామీ! ఎద్దుతో ఎకసెక్కాలా.. దెబ్బకు అబ్బా అనాల్సిందే!

తన పని తాను చేసుకుంటున్న వాళ్లను అస్సలు రెచ్చగొట్టకూడదు. ఒకవేళ రెచ్చగొడితే.. పర్యావసానం దారుణంగా ఉంటుంది...

Viral Video: ఇదేం వెర్రి వేషాలు సామీ! ఎద్దుతో ఎకసెక్కాలా.. దెబ్బకు అబ్బా అనాల్సిందే!
Trending
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 05, 2022 | 2:03 PM

తన పని తాను చేసుకుంటున్న వాళ్లను అస్సలు రెచ్చగొట్టకూడదు. ఒకవేళ రెచ్చగొడితే.. పర్యావసానం దారుణంగా ఉంటుంది. సరిగ్గా దీనికి సూట్ అయ్యే విధంగా ఓ వైరల్ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక్కడొక ఎద్దు వీధిలో కూల్‌గా నిలబడి ఉంటే.. ఓ వ్యక్తి వచ్చి దాన్ని రెచ్చగొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మీరు ఖంగుతింటారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వీధిలో నిల్చున్న ఎద్దును.. అవసరం లేకపోయినా.. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఈలలు, కేరింతలు కొడుతూ రెచ్చగొడుతున్నట్లు మీరు చూడవచ్చు. అతడు చేసిన పనికి ఎద్దుకు కోపం వచ్చి కాలితో రంకెలు వేస్తూ సిగ్నల్స్ ఇస్తుంది. అయినా ఆ యువకుడు విజిల్స్ కొడుతూ రెచ్చగొట్టడం మానడు. ఇంకేముంది.! ఆ ఎద్దు యువకుడి వైపుకు దూసుకొచ్చి కొమ్ములతో గాల్లోకి ఎగరేస్తూ కుమ్మేస్తుంది.. ఈ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు తప్ప.. అతడి ఫ్రెండ్స్ ఏం చేయలేకపోయారు.. ఆ ఎద్దు దూరం వెళ్ళాక.. రోడ్డుపై పడి ఉన్న సదరు యువకుడిని పక్కకు తీసుకెళ్లారు అతడి ఫ్రెండ్స్. ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వైరల్ వీడియోను ‘Figen’ అనే ట్విట్టర్ యూజర్ ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయగా.. దీనికి ఇప్పటివరకు 26 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 10 వేల మందికి పైగా నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి.

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..