Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: రంకెలేసిన బుల్.. 3 నెలల తర్వాత 30 లక్షల కోట్ల లాభం.. ఫుల్ జోష్‌లో ఇన్వెస్టర్లు ..

Stock Market Today: ఫుల్ జోష్‌లో స్టాక్‌ మార్కెట్స్‌ దూసుకుపోయాయి. స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిక్స్డ్ ఫలితాలు ఉన్నప్పడటికీ దేశీయ సూచీలు దూకుడుతో దూసుకుపోయాయి.

Stock Market: రంకెలేసిన బుల్.. 3 నెలల తర్వాత 30 లక్షల కోట్ల లాభం.. ఫుల్ జోష్‌లో ఇన్వెస్టర్లు ..
Stock Market
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 04, 2022 | 5:21 PM

ఫుల్ జోష్‌లో స్టాక్‌ మార్కెట్స్‌(Stock Market ) దూసుకుపోయాయి. స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిక్స్డ్ ఫలితాలు ఉన్నప్పడటికీ దేశీయ సూచీలు దూకుడుతో దూసుకుపోయాయి. రష్యా- ఉక్రెయిన్​ యుద్ధంలో సానుకూలత.. హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ విలీన ప్రకటన వెలువడటం వల్ల ముంబై దలాల్ మార్కెట్‌‌కు బూస్టింగ్ ఇచ్చింది. షేర్లు దూసుకెళ్లటమూ మర్కెట్లకు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో కొనుగోళుదారుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. అంతే కాదు మదుపరులు కొనుగోళ్లకు ముందుకువచ్చారు. దీంతో మార్కెట్లు తిరిగి 60వేల బెంచ్​ మార్క్​ను దాటింది సెన్సెక్స్​. ముంబై స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 1335 పాయింట్ల వృద్ధితో 60,612 వద్ద స్థిరపడింది. 59,764 పాయింట్ల వద్ద వారాన్ని ప్రారంభించిన సెన్సెక్స్​ ఒక దశలో 60,845 పాయింట్ల గరిష్ఠాన్ని టచ్ చేసింది. చివరకు 60,612 వద్ద క్లోజింగ్ బెల్ మోగింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచి నిఫ్టీ- 383 పాయింట్ల లాభంతో.. 18,053 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 17,809 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఒక దశలో 18,115 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది. చివరకు 18,053 వద్ద స్థిరపడింది.

మార్కెట్‌లో ఈ బూమ్ కారణంగా బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.272.48 లక్షల కోట్లకు పెరిగింది. గత వారం రూ.267.88 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఈ విధంగా ఈరోజు ఇన్వెస్టర్ల సంపదలో రూ.4.6 లక్షల కోట్ల జంప్ కనిపించిది. ఫిబ్రవరి 24న మార్కెట్ ముగిసినప్పుడు.. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.242.24 లక్షల కోట్లు ఉంది. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలో ఇన్వెస్టర్ల సంపద 30 లక్షల కోట్లకు పైగా చేరుకోవడం శుభ పరిణామం అని చెప్పవచ్చు.

HDFC, HDFC చరిత్రలో అతిపెద్ద జంప్..

ఈరోజు స్టాక్ మార్కెట్ మూడు నెలల గరిష్ఠ స్థాయిలో ముగిసింది. 13 ఏళ్లలో హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల చరిత్రలో ఇదే అతిపెద్ద పెరుగుదల. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి విలీనం వార్తల కారణంగా నిఫ్టీ బ్యాంక్ 4 శాతం (1486 పాయింట్లు) లాభంతో 38635 వద్ద ముగిసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 4.64 శాతం, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3.92 శాతం లాభపడ్డాయి.

క్రూడ్ ఆయిల్ తగ్గుతుందనే సంకేతాలు 

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ముగింపు దిశగా కదులుతోంది. దీని కారణంగా మార్కెట్ సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. ఇరు దేశాలు చర్చల దిశలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాయి. దీని కారణంగా ముడి చమురు తగ్గుతుండటం.. బ్యారెల్‌కు $105 స్థాయిలో ట్రేడవుతోంది. చౌక చమురు భారతదేశానికి పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు.

లాభనష్టాల్లోనివి: హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, హెడ్​డీఎఫ్​సీలు సుమారు 10 శాతం మేర లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్​ 4శాతం, హెడ్​డీఎఫ్​సీ లైఫ్ 3.83శాతం, కొటక్​ మహీంద్రా బ్యాంకు 3.23 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు.. ఇన్ఫోసిస్​ ఒక శాతానికిపైగా నష్టపోయింది. టైటాన్​ కంపెనీ, జెఎస్​ డబ్ల్యూ స్టీల్​లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి: Hyderabad Traffic Police: దర్శకుడు త్రివిక్రమ్‌ కారు తనిఖీ.. జరిమానా విధించిన పోలీసులు

Lemon Price: సామాన్యుడి జోబును పిండేస్తున్న నిమ్మ.. రాకెట్‌లా పైపైకి దూసుకుపోతున్న ధర..