Lemon Price: సామాన్యుడి జోబును పిండేస్తున్న నిమ్మ.. రాకెట్‌లా పైపైకి దూసుకుపోతున్న ధర..

Lemon Price: వేసవి కాలం (Summer Season)వచ్చిందంటే చాలు.. దాహార్తి తేరుకోవడానికి పానీయాల వైపు చూస్తారు. ఇంకా చెప్పాలంటే.. వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి కొబ్బరి నీరు (Coconut Water), పల్చటి మజ్జిగ..

Lemon Price: సామాన్యుడి జోబును పిండేస్తున్న నిమ్మ.. రాకెట్‌లా పైపైకి దూసుకుపోతున్న ధర..
Lemon Price Hike
Follow us

|

Updated on: Apr 04, 2022 | 12:47 PM

Lemon Price: వేసవి కాలం (Summer Season)వచ్చిందంటే చాలు.. దాహార్తి తేరుకోవడానికి పానీయాల వైపు చూస్తారు. ఇంకా చెప్పాలంటే.. వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి కొబ్బరి నీరు (Coconut Water), పల్చటి మజ్జిగ (Butter Milk, చెరకు రసం (Sugar Cane Juice), నిమ్మకాయ షరబత్ (Lemon Water) వంటి వాటిని తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు.  ముఖ్యంగా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ నిమ్మకాయ తో తయారు చేసిన వాటర్ ను తాగడానికి ఇష్టపడతారు. దాహార్తిని తీర్చడమే కాదు.. తక్షణ శక్తిని కూడా ఇస్తుంది ఈ లెమన్ వాటర్.. అయితే ఇప్పుడు మార్కెట్ లో నిమ్మకాయ ధర వినియోగదారులకు షాక్ ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒకొక్క నిమ్మకాయ పది రూపాయలకు కూడా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా గూడూరు మార్కెట్ లో నిమ్మధర రికార్డ్ స్థాయికి చేరుకుంది.

ఇంకా చెప్పాలంటే నిమ్మ ధరలు ఆపిల్ ధరలతో పోటీపడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో నిమ్మ రైతులు ధరలు లేక నిన్న మొన్నటి వరకూ దిగాలు పడ్డారు. అయితే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి..  ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి.. మరోవైపు పండగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దీంతో నిమ్మ రైతులకు కాలం కలిసొచ్చింది. డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతుండటంతో నిమ్మ రైతులకు లాభాల బాట పట్టారు.

తాజాగా గూడూరు నిమ్మ మార్కెట్ లో కిలో నిమ్మకాయలు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మొదటి రకం నిమ్మకాయలు కిలో రూ. 160 లకు కొనుగోలు చేశారు. రెండో రకం నిమ్మ కాయలు రూ.130 నుంచి రూ.150లు ఉండగా.. నిమ్మ పండ్లు కిలో రూ.100 నుంచి రూ.130 మేర పలికింది.

ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, నిమ్మ దిగుబడి తక్కువగా ఉండడంతో ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. అంతేకాదు తాజా ధరలతో రైతులు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో కిలోకు గరిష్ఠంగా రూ.70 దక్కాయని రైతులు గుర్తు చేసుకున్నారు

Also Read: Pawan Kalyan: జిల్లాల విభజన లోపభూయిష్టం..ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వలేదన్న జనసేనాని