AP Weather Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్ .. రేపు దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం..
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఓ వైపు వివిధ ప్రాంతాల్లో భానుడు భగభగ మంటున్నాడు.. మరోవైపు తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. అయితే సాయంత్రం అయితే మేఘవృతమవుతుంది..
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఓ వైపు వివిధ ప్రాంతాల్లో భానుడు భగభగ మంటున్నాడు.. మరోవైపు తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. అయితే సాయంత్రం అయితే మేఘవృతమవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్, యానం(Yanam)లో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రానున్న మూడు రోజుల్లో వివిధ ప్రాంతాలకు వాతావరణం సూచన చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి మొత్తం మూడురోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు వాతావరణం పొడిగా ఉండే ఉంటుంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఎల్లుండి మాత్రం కోస్తా ఆంధ్రా లో వాతావరణం పొడిగా ఉండే అవకాశముందని పేర్కొంది.
రాయలసీమ: ఈరోజు, రేపు , ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు.
Also Read: Hyderabad Traffic Police: దర్శకుడు త్రివిక్రమ్ కారు తనిఖీ.. జరిమానా విధించిన పోలీసులు
Lemon Price: సామాన్యుడి జోబును పిండేస్తున్న నిమ్మ.. రాకెట్‌లా పైపైకి దూసుకుపోతున్న ధర..