Half day schools in AP: ఏపీలో నేటి నుంచి ఒంటి పూట బడులు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి (ఏప్రిల్ 4) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్. సురేష్‌ కుమార్‌ (S. Suresh Kumar) ఆదేశాలు జారీ చేశారు..

Half day schools in AP: ఏపీలో నేటి నుంచి ఒంటి పూట బడులు!
Schools
Follow us

|

Updated on: Apr 04, 2022 | 11:56 AM

Half day school in AP begins today: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి (ఏప్రిల్ 4) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్. సురేష్‌ కుమార్‌ (S. Suresh Kumar) ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు ఉదయం 7 గంటల 30 నిముషాల నుంచి ఉదయం 11 గంటల 30 నిముషాల వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన (Mid-day meals) అనంతరం విద్యార్ధులను ఇళ్లకు పంపాలన్నారు. ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. అందువల్ల regional joint director of school education, DEO ప్రణాళిక ప్రకారం విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. మరోవైపు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు మే 6న ప్రారంభమై, మే 23వ తేదీతో ముగియనున్నాయి. ఇక సెకండ్‌ ఇయర్‌ విషయానికొస్తే మే 7వ తేదీ నుంచి మే 24వరకు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

Also Read:

Science Facts: నదులు, చెరువుల్లోని నీరు వేసవిలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉంటాయి? దీని వెనుక సైన్స్‌ ఇదే..