AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharad Pawar: ఢిల్లీలో శరద్ పవార్ విందు రాజకీయం.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, సంజయ్ రౌత్, గడ్కరీ సైతం హాజరు!

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ విందు రాజకీయం చర్చనీయాంశంగా మారింది.

Sharad Pawar: ఢిల్లీలో శరద్ పవార్ విందు రాజకీయం.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, సంజయ్ రౌత్, గడ్కరీ సైతం హాజరు!
Sharad Pawar Hosts Dinner
Balaraju Goud
|

Updated on: Apr 06, 2022 | 8:24 AM

Share

Sharad Pawar Hosts Dinner: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ విందు రాజకీయం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర(Maharashtra)లో రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న పోరు మధ్య, నిన్న రాజధాని ఢిల్లీలోని తన నివాసం 6 జన్‌పథ్‌లో మహారాష్ట్ర ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సహా పలువురు నేతలు ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ డిన్నర్ పార్టీ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆస్తులపై దాడి చేసిన ED, భారీగా జప్తు చేసిన రోజున జరిగడం విశేషం.

అయితే, ఈ విందులో సంజయ్ రౌత్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని NCP ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిన్న, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రౌత్, అతని కుటుంబానికి చెందిన అలీబాగ్‌లోని ఎనిమిది ప్లాట్లను, ముంబైలోని దాదర్ శివారులోని ఒక ఫ్లాట్‌ను ED జప్తు చేసింది.

విశేషమేమిటంటే, లోక్‌సభ సెక్రటేరియట్‌లో నిర్వహిస్తున్న రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు దేశ రాజధానికి చేరుకున్నారు. అంతకుముందు, మహారాష్ట్ర ఎమ్మెల్యేలు టీ పార్టీపై రౌత్‌ను ఆయన నివాసంలో కలిశారు. శరద్ పవార్‌ను యూపీఏ చైర్‌పర్సన్‌గా చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ విషయంపై స్వయంగా ఆయన విముఖత వ్యక్తం చేసినా ఆయన ఇంట్లో నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, అధికార, విపక్షాలకు చెందిన రాజకీయ నాయకులు హాజరుకావడంతో మహారాష్ట్ర పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also…  News Watch: మోదీ, షా లతో జగన్ ఏం మాట్లాడారో తెలుసా?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్