AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Crop: అకాల వర్షాలతో ఉల్లి పంటకు దెబ్బ.. రూపాయికే కిలో అమ్మి వినూత్న నిరసన..!

Onion Crop: అకాల వర్షాలు కోయంబత్తూరు ప్రాంత ఉల్లి రైతుల నడ్డి విరిచాయి. దిగుబడి సరిగ్గా లేని చిన్న ఉల్లిని కొనేవారు లేక రేటు పడిపోయింది. విధిలేని పరిస్థితుల్లో కిలో..

Onion Crop: అకాల వర్షాలతో ఉల్లి పంటకు దెబ్బ.. రూపాయికే కిలో అమ్మి వినూత్న నిరసన..!
Subhash Goud
| Edited By: Phani CH|

Updated on: Apr 06, 2022 | 9:28 AM

Share

Onion Crop: అకాల వర్షాలు కోయంబత్తూరు ప్రాంత ఉల్లి రైతుల నడ్డి విరిచాయి. దిగుబడి సరిగ్గా లేని చిన్న ఉల్లిని కొనేవారు లేక రేటు పడిపోయింది. విధిలేని పరిస్థితుల్లో కిలో రూపాయికే అమ్మేసి నిరసన తెలిపారు. దీంతో ఉల్లి ధర (Onion Price) తమిళ రైతు కంట నీరు తెప్పిస్తోంది. కోయంబత్తూర్‌ ప్రాంతంలో చిన్న ఉల్లిని పండించే రైతులు (Farmers) నిండా మునిగారు. ఈ ఏడాది పంట దిగుబడి సరిగ్గా రాలేదు. అమ్ముదామంటే సరైన రేటు లేదు. పైగా మార్కెట్‌లో కొనేవారే కరువయ్యారు.. నాణ్యతలేని ఈ పంటను ఏమి చేసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

తలవాడి హిల్స్‌లోని దాదాపు 550 ఎకరాల్లో చిన్న ఉల్లిని సాగు చేస్తారు. ఇక్కడ వ్యాపారులు రైతుల నుండి ఉల్లిపాయలను కొనుగోలు చేసి కోయంబత్తూర్, దిండిగల్, తిరుచ్చి, మధురై తదితర ప్రాంతాలకు పంపిస్తారు. కాగా మార్చి నెల చివరి వారంలో నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా పంట చాలా దెబ్బతింది.. దీంతో సరైన దిగుబడి రాలేదు.. పైగా పంట ఉల్లి పంట నాణ్యత కూడా సరిగ్గాలేదు.

రైతుల వినూత్న నిరసన..

గత నెల మూడో వారంలో వ్యాపారులు రైతుల నుంచి కిలో ఉల్లిని 8 రూపాయలకు కొనుగోలు చేస్తే మార్కెట్‌లో 15 నుంచి 20 రూపాయల దాకా అమ్ముడైంది. ఇప్పుడు వ్యాపారులు కిలో 3 రూపాయల్లో కొంటాంటున్నారు. కానీ చేలలో కోయడానికి 4 రూపాయలు కూలి ఇవ్వాల్సి వస్తోంది. నిండా మునిగామని అర్థమైన రైతులు కోయంబత్తూరు కలెక్టరేట్‌ ముందు వినూత్న నిరసనకు దిగారు.. కిలో ఉల్లి కేవలం రూపాయికే అమ్మి నిరసన తెలిపారు.

కూలీల కొరత.. ఉత్పత్తి వ్యయంతో దెబ్బ..

కూలీల కొరత, ఉత్పత్తి వ్యయం పెరగడం, ధర పడిపోవడం తమను దెబ్బతీశాయని చిన్న ఉల్లిని పండించే రైతులు వాపోతున్నారు.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.. కనీస గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Chandigarh Row: చండీగఢ్‌‌ వివాదంలోకి మరో రాష్ట్రం.. తమకు వాటా రావాలంటున్న హిమాచల్‌..

Chandigarh Row: ఆ రెండు రాష్ట్రాల మధ్య రాజధాని రచ్చ.. చండీగఢ్ వివాదంలో మరో ట్విస్ట్..