AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? తల్లి మృతదేహాన్ని మంచం మీద మోస్తున్న నలుగురు మహిళలు.. వీడియో వైరల్

Madhya Pradesh: మనిషి అంబరాన్ని తన తెలివి తేటలతో అంబరాన్ని అందుకుంటున్నాడు. సముద్రం లోతులు కొలుస్తున్నాడు.. కానీ మనిషిలో ఉండాల్సిన మానవత్వాన్ని మాత్రం మరచిపోతున్నాడు. మానవ సంబంధాలన్నీ..

Madhya Pradesh: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? తల్లి మృతదేహాన్ని మంచం మీద మోస్తున్న నలుగురు మహిళలు.. వీడియో వైరల్
Viral Video In Madhya Prade
Surya Kala
|

Updated on: Apr 06, 2022 | 9:47 AM

Share

Madhya Pradesh: మనిషి అంబరాన్ని తన తెలివి తేటలతో అంబరాన్ని అందుకుంటున్నాడు. సముద్రం లోతులు కొలుస్తున్నాడు.. కానీ మనిషిలో ఉండాల్సిన మానవత్వాన్ని మాత్రం మరచిపోతున్నాడు. మానవ సంబంధాలన్నీ వ్యాపార బంధాలే అన్న చందంగా తయారు అవుతున్నాడు. తాజాగా మానవత్వం ఎక్కడ అనే విధంగా ఓ దారుణ ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh) లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని రేవా జిల్లా(Reva District)లో బుధవారం శవాలను తరలించే వాహనం అందుబాటులో లేకపోవడంతో నలుగురు మహిళలు తమ తల్లి మృతదేహాన్ని మంచంపైకి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అయింది. ప్రస్తుతం ఈ ఘటన ట్విట్టర్‌( Twitter)లో దుమారం రేగింది.

మృతురాలిని 80 ఏళ్ల ములియా కేవత్‌గా గుర్తించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కేవత్‌ ను ఆమె కుటుంబ సభ్యులు  రాయ్‌పూర్-కుర్చులియన్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. అయితే కేవత్ మృతదేహాన్ని 5కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి తిరిగి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ గానీ,  మృతదేహాలను తరలించే వాహనంగానీ అందుబాటులో లేదు. దీంతో కేవత్ నలుగురు కుమార్తెలు మృతదేహాన్ని ఒక మంచం మీద పడుకోబెట్టారు. మండే ఎండలో తమ తల్లి శవాన్ని తిరిగి గ్రామానికి తీసుకుని వెళ్లారు. అయితే ఇలా శవాన్ని తరలిస్తుంటే.. రోడ్డుమీద ఎందరో చూస్తూ ఉండిపోయారు కానీ ఎవరూ మానవత్వంతో స్పందించింది లేదు.. కానీ ఎవరో ఈ ఘటనను వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఆరోగ్య వ్యవస్థపై రాజకీయ చర్చకు దారితీసింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శోభా ఓజా ఇది మానవాళిని సిగ్గుపడే విషాద సంఘటనగా అభివర్ణించారు. కూతుళ్లకు అంబులెన్స్, శవవాహనం కూడా లభించలేదు. నిజానికి, ఆ నాలుగు మహిళలు మంచం మీద మోసింది..ఓ స్త్రీ మృతదేహం కాదు, మహిళా సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం అని పిలవబడే వ్యవస్థ మృత దేహం.” అని అన్నారు.

ఈ వీడియో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. “ఈ వీడియో … శివరాజ్ ప్రభుత్వ సుపరిపాలన వాస్తవికతను చూపుతుంది… మంచంపై ఉన్న తల్లి మృతదేహాన్ని కుమార్తెలు మోసుకెళ్లారు. అంబులెన్స్ లేదు, ప్రభుత్వ సహాయం లేదు,  5 కి.మీ దూరం ప్రయాణించడం దారుణమని అన్నారు.

అయితే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రజనీష్ అగర్వాల్ ప్రభుత్వాన్ని సమర్థించారు. “రాష్ట్ర ప్రభుత్వ సంబల్ పథకం కింద, మరణించిన వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియల కోసం రూ. 5,000 ఇచ్చే నిబంధన ఉంది. ప్రభుత్వం ఆదరణ కల్పించింది కానీ సమాజంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. సమాజం కూడా తన కర్తవ్యాన్ని పోషించాలి” అని అన్నారు.

Also Read: Newborn Girlchild: తమ ఇంట పుట్టిన ఆడపిల్లకు ఘన స్వాగతం.. ఏకంగా హెలికాఫ్టర్ ఏర్పాటు.. ఎక్కడంటే..