Newborn Girlchild: తమ ఇంట పుట్టిన ఆడపిల్లకు ఘన స్వాగతం.. ఏకంగా హెలికాఫ్టర్ ఏర్పాటు.. ఎక్కడంటే..
Newborn Girlchild: గత కొంతకాలం వరకూ ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని భావించేవారు. అయితే కొడుకు అంటే ముద్దు, కూతురు వద్దు, కొడుకు ప్లస్, కూతరు మైనస్ అంటూ లెక్కలు వేసుకునే రోజులు వచ్చాయి..
Newborn Girlchild: గత కొంతకాలం వరకూ ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని భావించేవారు. అయితే కొడుకు అంటే ముద్దు, కూతురు వద్దు, కొడుకు ప్లస్, కూతరు మైనస్ అంటూ లెక్కలు వేసుకునే రోజులు వచ్చాయి. రాను రాను ఆడపిల్లలపై వివక్ష పెరిగి కడుపులో ఉన్నప్పుడే భూమి మీద పడక ముందే చిదిమేసే రోజులు దాపురించాయి. ఆడపిల్ల పుట్టింది అంటే ఆమెను ఎలా అంతమొందించాలనుకునేవారు చాలామంది ఉన్నారు. ఆడపిల్ల పుడుతుందని తెలిసి ముందుగానే అబార్షన్ చేయించే వారు ఎందరో ఉన్నారు. అయితే ప్రభుతం ఆడపిల్లను రక్షించేందుకు నిబంధనలను కఠిన తరం చేయడం, శిక్షలు అమలు చేస్తుండటంతో కొంత ఆడపిల్ల పట్ల వివక్ష తగ్గిందనే చెప్పాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ వివిక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ కొందరు మానవతా మూర్తులు మాత్రం లక్ష్మీ దేవి పుట్టిందని గట్టిగా నమ్ముతారు. అప్పుడే పుట్టిన చిన్నారికి ఓ కుటుంబం చెప్పిన ఘన స్వాగతం వీడియో నెట్టింట్లో వైరల్(Viral Video) అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలో మాత్రం ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవే తమ ఇంటికి వచ్చినట్టుగా భావిస్తారు… ఘనంగా పండగ చేసుకుంటారు. వారికి వ్యాపారపరంగా, ఉద్యోగ పరంగా కలసి వస్తుందని విశ్విస్తారు. తాజాగా పూనేలో ఆడపిల్ల పుట్టిందని తెలిసిన కుటుంబ సభ్యులు ఆ పాపను ఇంటికి తెచ్చేందుకు ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. జనవరి 22న భొసారి పట్టణంలో విశాల్ జరేకర్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. అయితే విశాల్ కుంటుంబం ఆ చిన్నారిని ఏప్రిల్ 2న హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకొచ్చి తల్లి, బిడ్డలకు ఘనంగా స్వాగతం పలికారు. ఆడపిల్లల పట్ల ఆ తండ్రికి ఉన్న మహోన్నత భావానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
#WATCH Shelgaon, Pune | Grand Homecoming ! A family brought their newborn girlchild in a chopper
We didn’t have a girlchild in our entire family. So, to make our daughter’s homecoming special, we arranged a chopper ride worth Rs 1 lakh:Vishal Zarekar,father
(Source: Family) pic.twitter.com/tA4BoGuRbv
— ANI (@ANI) April 5, 2022