Chanakya Niti: మనిషి సంతోషంగా ఉండాలన్నా.. సక్సెస్ అందుకోవాలన్నా.. ఈ 4 విషయాలను గుర్తుంచుకోమన్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)  గొప్ప వ్యూహకర్త. తక్షశిల లో అధ్యాపకుడిగా పనిచేశారు. అంతేకాదు ఎన్నో పుస్తకాలను రాశారు. ముఖ్యంగా చాణుక్యుడు తాను రచించిన నీతి  శాస్త్రం..

Chanakya Niti: మనిషి సంతోషంగా ఉండాలన్నా.. సక్సెస్ అందుకోవాలన్నా.. ఈ 4 విషయాలను గుర్తుంచుకోమన్న చాణక్య
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2022 | 8:17 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)  గొప్ప వ్యూహకర్త. తక్షశిల లో అధ్యాపకుడిగా పనిచేశారు. అంతేకాదు ఎన్నో పుస్తకాలను రాశారు. ముఖ్యంగా చాణుక్యుడు తాను రచించిన నీతి  శాస్త్రం (Niti shastra) లో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. నీతిశాస్త్రంలో చెప్పిన  విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు. ఆచార్య చాణక్యుడు జీవితంలోని అన్ని రకాల సమస్యలను అధిగమించే మార్గాన్ని నీతి శాస్త్రంలో చూపించాడు. మనిషి సంతోషంగా ఉండటానికి, ప్రతికూలత నుంచి బయటపడడానికి ఒక వ్యక్తి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని.. వారికీ వీలైనంత దూరంగా ఉండాలని చాణక్య చూచించాడు. అవి ఏమిటో చూద్దాం..

దూషించే వ్యక్తులు: చాణక్య నీతి ప్రకారం.. మన మంచిని కోరుకోని.. మనల్ని ఎల్లపుడూ చెడు కోరుకుంటూ శపించే వ్యక్తితో ఎప్పుడూ జీవించకూడదు. అలాంటి వ్యక్తి మీలో ప్రతికూలతను కూడా సృష్టించగలడు. అంతేకాదు ఎదుటివారు చేదుకొరుకునే వ్యక్తి.. తాను ఎప్పుడూ దుఃఖంలో మునిగి ఉంటాడు. వారు ఎవరినీ సంతోషపెట్టలేరు. అందువల్ల, మీ ఆనందాన్ని సంతోషాన్ని కాపాడుకోవడానికి.. అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచడం మేలు అంటున్నాడు చాణక్య.

మూర్ఖులతో జీవించకండి: చాణక్య నీతి ప్రకారం.. మూర్ఖులతో కలిసి జీవించకూడదు. మూర్ఖులకు దేనినీ వివరించే ప్రయత్నం చేయకూడదు. ఇది మీ సమయాన్ని వృధా చేస్తుంది. ఎందుకంటే మూర్ఖులు ఎవరి మాట వినరు. తమ మాట మాత్రమే సరైనది అంటారు. అతని మాటలు సరైనవి కాదని ఎంత వివరించేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండదు.  మూర్ఖులు ఎవరి మాట వినరు. కనుక అటువంటి వారితో సమయం గడపడం ఎవరికైనా హానికరం. అలాంటి వారితో  మాట్లాడటం మీ శక్తిని వృధా చేసినట్లే.

చెడు ఆలోచనలు కలిగిన స్త్రీ: చెడు ఆలోచనలు ఉన్న మహిళలకు దూరంగా ఉండాలి. అలాంటి మహిళల వలన ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు అలాంటి మహిళలు మీ జీవితంలో ఇబ్బందులను కలిగించవచ్చు. కనుక చెడు ఆలోచనల నుండి ఎల్లప్పుడూ దూరం ఉండండి. అంతేకాదు అలాంటి స్త్రీకి సహాయం చేయడం కూడా మీకు హానికరం. మీరు చేసే సహాయాన్ని తప్పుగా ఉపయోగించుకోవచ్చు… కనుక అలంటి మహిళలకు ఎంత దూరం ఉంటె అంత మంచిది.

మూర్ఖుడైన శిష్యుడు: గురువు తన శిష్యుడిని జీవితంలో ముందుకు సాగడానికి, అతని లక్ష్యాలను సాధించడానికి ప్రేరేపిస్తాడు. గురువు తన శిష్యుడికి ప్రతి కష్టాన్ని ఎలా అధిగమించాలో నేర్పుతారు. కానీ గురువుకు మూర్ఖుడైన శిష్యుడు దొరికితే, జ్ఞాని అయిన ఋషి కూడా అతనికి ఏమీ బోధించలేడు. అలాంటి శిష్యుడి వల్ల గురువుకున్న ఇమేజ్ కూడా చెడిపోతుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మతపరమైన, నమ్మకం, విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

Tirupati: వేంకటేశ్వరస్వామివారి గెడ్డం కింద రోజూ పచ్చకర్పూరం అద్దుతారు ఎందుకో తెలుసా..