AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2022: నవరాత్రి రోజుల్లో ఏ రోజున ఈ రెండు శక్తి పీఠాల్లో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందంటే..

Nava Ratri 2022: నవరాత్రుల పర్వదినం సందర్భంగా ఏదైనా శక్తిపీఠాన్ని(Shakti Pitha) సందర్శించడం, పూజించడం వలన భక్తులు కోరిన కోర్కెలు తీరతాయని.. అదృష్టంగా పురాణాల కథనం. సతి భాగవతాలు పడిన 51 ప్రదేశాలు..

Navaratri 2022: నవరాత్రి రోజుల్లో ఏ రోజున ఈ రెండు శక్తి పీఠాల్లో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందంటే..
Varanasi Ujjain Shakti Peet
Surya Kala
|

Updated on: Apr 06, 2022 | 10:22 AM

Share

Navaratri 2022: నవరాత్రుల పర్వదినం సందర్భంగా ఏదైనా శక్తిపీఠాన్ని(Shakti Pitha) సందర్శించడం, పూజించడం వలన భక్తులు కోరిన కోర్కెలు తీరతాయని.. అదృష్టంగా పురాణాల కథనం. సతి భాగవతాలు పడిన 51 ప్రదేశాలు శక్తిపీఠాలుగా పూజింపబడుతున్నాయని ప్రతీతి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఈ పవిత్ర శక్తిపీఠాల్లో రెండు ప్రసిద్ధ శక్తిపీఠాలు నవరాత్రి సందర్భంగా దర్శించుకుంటారు. ఈ క్షేత్రాలను సందర్శించినప్పుడు అమ్మవారి దివ్యమైన రూపాన్ని మాత్రమే కాకుండా, లయకారుడు శివుడి ఆశీర్వాదాలను కూడా పొందుతారు. ఈ రెండు శక్తిపీఠాలు భారతదేశం(India)లోని పురాతన నగరాలు అంటే కాశీ(Kashi), ఉజ్జయిని(Ujjain)లో ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో శివుడిని.. శక్తిస్వరూపిణీతో కలిపి దర్శించుకోవచ్చు. ఈరోజు  దేశంలోని ఈ రెండు పవిత్ర శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం..

కాశీలో బాబా విశ్వనాథ్, విశాలాక్షి అమ్మవారి ఆలయం:  వారణాసి నగరాన్ని కాశి విశ్వనాథ నగరం అని పిలుస్తారు. ఈ పురాతన పవిత్ర నగరంలో అనేక శక్తి పీఠాలు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైన ఆలయం విశాలాక్షి ఆలయం. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. వారణాసిలోని ఈ పవిత్రమైన అమ్మవారి ఆలయ నిర్మాణంలో దక్షిణ భారతీయ కళాఖండాలను చూడవచ్చు. వారణాసి ఆలయ పరిసరాల్లో సతీదేవి చెవి పడిందని పురాణాల ప్రకారం తెలుస్తోంది.

చైత్ర నవరాత్రులలో ఏ రోజుల్లో ప్రత్యేక దర్శనం అంటే..: కాశీలో ఉన్న ఈ శక్తిపీఠంమైన విశాలాక్షి అమ్మవారి ఆలయంలో రెండు విగ్రహాలను చూడవచ్చు. వాటిలో ఒకటి కదలనిదిగా,మరొకటి కదిలేదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ రెండు విగ్రహాలను సమానంగా పూజిస్తారు. చైత్ర నవరాత్రులలో.. పంచమి రోజున నవ గౌరీగా విశాలాక్షి అమ్మవారి ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం మీర్ఘాట్ ప్రాంతంలో, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం సమీపంలో ఉంది. చైత్ర నవరాత్రుల్లో వారణాసికి వెళితే.. శివ సమేతంగా ఉన్న విశాలాక్షి అమ్మవారి పవిత్ర శక్తిపీఠాన్ని సందర్శించడం మర్చిపోవద్దు.

ఉజ్జయినిలోని శక్తి పీఠం: ఉజ్జయిని ప్రాచీన భారత చరిత్రలో ప్రముఖ పట్టణం. ఇది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటి. 12 శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగంతో పాటు అమ్మవారు మహంకాళిగా భక్తులతో పూజలను అందుకుంటున్నారు. ఉజ్జయినిలోని ఈ శక్తిపీఠంలో సతీదేవి కుడి మోచేయి ఈ ప్రదేశంలో పడిందని పురాణాల కథనం.  ఈ పవిత్ర శక్తిపీఠం మహాకాళేశ్వర ఆలయానికి సమీపంలో రుద్రసాగర్ చెరువు పశ్చిమ ఒడ్డున ఉంది.

 కోరిన కోరికలు నెరవేర్చే దీపం:  హరసిద్ధి దేవి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే..ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. కేవలం మోచేతి మాత్రమే హరిసిద్ధి దేవిగా పూజించబడుతుంది. అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన వెంటనే రెండు పెద్ద దీపస్తంభాలు.. ఆ స్థంభం స్త్రీ, పురుషులకు చిహ్నంగా పరిగణించబడుతుంది.  ఈ దీపపు స్తంభాలోని కుడి వైపున ఉన్న నిలువు వరుస పెద్దది, ఎడమ వైపున చిన్నది. ప్రజలు దీనిని శివ-శక్తి చిహ్నంగా కూడా భావిస్తారు. ఈ దీప స్తంభంపై దీపం వెలిగిస్తే.. ఎటువంటి కోరికలైన నెరవేరతాయని.. భక్తుల నమ్మకం.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Newborn Girlchild: తమ ఇంట పుట్టిన ఆడపిల్లకు ఘన స్వాగతం.. ఏకంగా హెలికాఫ్టర్ ఏర్పాటు.. ఎక్కడంటే..

Madhya Pradesh: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? తల్లి శవాన్ని మంచంమీద పెట్టుకుని మోసుకెళ్లిన కూతుళ్లు.. వీడియో వైరల్

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..